ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నా రూటే సెపరేటు.. నలుగురికి నచ్చింది నాకసలే నచ్చదు

By

Published : Feb 10, 2023, 9:54 PM IST

Person Traveling On Horse: సాధారణంగా ఈ రోజుల్లో ద్విచక్ర వాహనాలు.. కార్లు ఇతర వాహనాలపై ఎక్కడకైనా వెళ్తుంటాం. కానీ ఆయన మాత్రం అందుకు భిన్నంగా ఎక్కడికైనా గుర్రం పైనే వెళ్తాడు. ఆయనే ముంతాజ్ దేశాయ్. ఆయన గురించి ఒకసారి తెలుసుకుందామా..?

Etv Bharat
Etv Bharat

Person Traveling On Horse: సహజంగా మనం ప్రయాణం చేయాలంటే బస్సు, కారు లేదా ద్విచక్ర వాహనం ద్వారా ప్రయాణిస్తుంటాం. కానీ ఓ పెద్దాయన తన చిన్ననాటి నుంచి తాను పెంచుకుంటున్న గుర్రాన్నే వాహనంగా మలుచుకున్నాడు. తాను పని కోసం ఎక్కడికి వెళ్లినా.. తన అశ్వం మీదే వెళ్తుంటాడు. ఆ వ్యక్తి పేరే ముంతాజ్ దేశాయ్. మహారాష్ట్ర సరిహద్దుల్లోని మేదన్ కల్లూరు గ్రామంలో ఈయన నివాసం ఉంటున్నాడు. తమ గ్రామం నుంచి మద్నూర్, కోటగిరి తదితర మండలాలకు గుర్రం పైనే వచ్చి పనులు చేసుకుని తిరిగి వెళ్తానని ఆయన చెబుతున్నారు. ఈ రోజుల్లో గుర్రంపై వెళ్తుండటం అరుదుగా కనిపిస్తుంది. ఈరోజుల్లోనూ గుర్రంపై వెళ్తున్న ముంతాజ్ దేశాయ్​ను అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.

ఆ వ్యక్తికి గుర్రమే వాహనం.. ఎక్కడికి వెళ్లిన సరే అలానే వెళతాడు

ABOUT THE AUTHOR

...view details