ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో కార్యకలాపాలు'

By

Published : May 20, 2020, 10:48 AM IST

కృష్ణా జిల్లాలో కంటైన్మెంట్​ జోన్లు మినహా... మిగిలిన ప్రాంతాల్లో అన్ని రకాల కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు.

collector speaking about the containment zones
మాట్లాడుతున్న కృష్ణాజిల్లా కలెక్టర్

కృష్ణా జిల్లాలో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో అన్ని రకాల కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమైన ఆయన... జిల్లాలో డీనోటిఫై చేసిన ప్రాంతాల వివరాలు వెల్లడిస్తామన్నారు.

జిల్లాలో 42 కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. వాటిలో విజయవాడ నగరంలోనే 20 జోన్లు ఉన్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లో పూర్తిగా సాధారణ పరిస్థితులు వచ్చాకే.. ఆంక్షలు సడలిస్తామని చెప్పారు. భౌగోళిక క్వారంటైన్ పద్దతిని ప్రస్తుతం నగరంలో అమలుచేస్తున్నామన్నారు. ఫలితంగా.. కొంతమేర కొత్త కేసుల శాతాన్ని తగ్గించగలుగుతున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details