ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వైకాపా నాయకులు మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారు.. చర్యలు తీసుకోండి'

By

Published : Jun 20, 2021, 6:57 AM IST

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని కాపవరంలో.. వైకాపా నాయకులు స్థానికంగా ఉన్న చెరువులోని మట్టిని అక్రమంగా తవ్వి అమ్ముకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులెవ్వరూ ఈ విషయంపై స్పందించటం లేదని.. కాపవరం సర్పంచ్ పద్మావతి వాపోయారు. తాను తెదేపా బలపరిచిన అభ్యర్థి కావటంతో.. ఎవ్వరు సహకరించడం లేదని ఆవేదన చెందారు.

kapavaram sarpanch asks to take action on ycp leaders who are digging sand in pond
వైకాపా నాయకులు మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారు

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పెరిసేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కాపవరంలో.. పదవి ఒకరిది, పెత్తనం మరొకరిది అన్నట్లు పరిస్థితి. గ్రామ పంచాయతీ తెదేపా బలపరిచిన.. చెరుకూరి పద్మావతి సర్పంచ్​గా ఎన్నికయ్యారు.

స్థానిక ఎమ్మెల్యే అండతో.. వైకాపా నాయకులు గ్రామంలోని చెరువు మట్టిని అక్రమంగా తవ్వి అమ్ముకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాపవరం గ్రామంలోని మంచినీటి చెరువు అభివృద్ధి కోసం, గతంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో.. చెరువులో మట్టిని బడుగు బలహీన వర్గాల ఇళ్ల స్థలాల మెరక, అంతర్గత రహదారుల కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వాడుకోవాలని తీర్మానం చేశారు. ఆ పనులు మొదలుపెట్టి మట్టిని మెరక పనులు చేయగా.. మిగిలిన మట్టిని అధికార పార్టీ నాయకులు యంత్రాలతో తవ్వించి అమ్ముకుంటున్నారని సర్పంచ్ ఆరోపణలు చేశారు.

చెరువు గట్టును సైతం తవ్వేస్తున్నారని.. గట్టుపై ఉన్న కొబ్బరిచెట్లు పడిపోయే విధంగా గట్లు తొలగిస్తున్నారని.. పంచాయతీకి వచ్చే ఆదాయం నష్టపోవాల్సి వస్తుందని సర్పంచ్ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎన్నిసార్లు పై అధికారులకు విన్నవించినా.. స్పందించటం లేదన్నారు. జిల్లా స్థాయి అధికారులకు తప్పుడు నివేదిక ఇచ్చి.. అక్కడ ఎటువంటి అవకతవకలు జరగడం లేదని కింది స్థాయి అధికారులు నివేదికలు ఇస్తున్నారని తెలిపారు.

తాను తెదేపా బలపరిచిన అభ్యర్థి అయిన కారణంగానే.. ఏ అధికారి సహకరించటం లేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక తహసీల్దార్​ను వివరణ కోరగా.. పేరెసేపల్లి పంచాయతీ నుంచి కంప్లైంట్ వచ్చిందిని.. అక్కడ ఎటువంటి అవకతవకలు జరగలేదని అన్నారు. ఇద్దరు వీఆర్ఏలను చెరువు వద్ద కాపలా ఉంచినట్టు తహసీల్దార్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేత.. కానీ ఆ విషయం మరువొద్దట!

ABOUT THE AUTHOR

...view details