ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Pothina Mahesh : 'పత్రికా ప్రకటన లేకుండా ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారు..?'

By

Published : Jun 25, 2021, 12:19 PM IST

విజయవాడ కార్పొరేషన్​లో పత్రికా ప్రకటన లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసి, రూ.3 కోట్లు దోచుకున్నారని జనసేన నేత పోతిన మహేష్ అన్నారు. ఈ అంశంపై సరైన ఆధారాలను త్వరలోనే బయటపెడతామని వెల్లడించారు. మరో వైపు అక్రమ కట్టడాలను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని పోతిన మహేష్ వ్యాఖ్యానించారు.

janasena leader pothina mahesh
జనసేన నేత పోతిన మహేష్

విజయవాడ కార్పొరేషన్‌లో ఉద్యోగాల పేరుతో రూ.3 కోట్లు దోచుకున్నారని జనసేన నేత పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ భాగ్యలక్ష్మి రూ.2 లక్షల చొప్పున వసూలు చేశారని పేర్కొన్నారు. పత్రికా ప్రకటన లేకుండా కార్పొరేషన్ ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారన్న పోతిన మహేష్‌... ప్రభుత్వంతో సంబంధం లేకుండా మంత్రి ఎలా ఉద్యోగాలు ఇస్తారని ప్రశ్నించారు. ఈ అంశంపై సరైన ఆధారాలను త్వరలోనే బయటపెడతానని వెల్లడించారు. అక్రమ కట్టడాలను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్, అనిశా అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అక్రమ కట్టడాలను ప్రోత్సహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోతే కోర్టు ద్వారా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details