ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వ నిర్ణయాలపై.. చట్ట సభల్లో చర్చించట్లేదు: జాస్తి చలమేశ్వర్

By

Published : Oct 27, 2021, 6:49 PM IST

ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా ఉంటున్నాయా? లేదా? అని శాసనసభ, పార్లమెంట్‌ సరైన రీతిలో చర్చించడం లేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో నిర్వహించిన "ఆంధ్ర విజ్ఞాన ఉత్సవం" కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Justice Jasthi Chalameswar
Justice Jasthi Chalameswar

ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు చట్టబద్ధంగా.. రాజ్యాంగబద్ధంగా.. ఉంటున్నాయా? లేదా? అని శాసనసభ, పార్లమెంట్‌ చర్చించడం లేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్(Former Supreme Court judge Justice Jasthi Chalameswar) అన్నారు. విజయవాడ(Vijayawada)లోని బాలోత్సవ్ భవన్ నిర్వహించిన ఆంధ్ర విజ్ఞాన ఉత్సవం(Andhra Vijnana Utsavam) కార్యక్రమానికి చలమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. "న్యాయ వ్యవస్థ వర్సెస్‌ కార్యనిర్వాహక వ్యవస్థ, అధికారాల విభజన-అనుచిత జోక్యాలు" అనే అంశాలపై చర్చించారు.

'ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగబద్ధమో కాదో శాసనసభ, పార్లమెంట్‌ చర్చిచడం లేదు'

అధికారం దుర్వినియోగం మానవ సహజ లక్షణమన్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్.. అందుకే ఒకరి చేతిలో అధికారం ఉండకుండా, మూడు భాగాలుగా విభజించారని గుర్తుచేశారు. ప్రభుత్వాలు చేస్తున్నది ఏదైనా పరిశీలించి.. తప్పా, ఒప్పా అని చెప్పటానికే న్యాయ వ్యవస్థ ఉందని స్పష్టం చేశారు. న్యాయమూర్తులు దైవాంశ సంభూతులు కాదని, వారు కూడా తప్పులు చేస్తారన్నారు.

మెజారిటీ ఉన్నవాళ్లు చేసేదే చట్టం కాదని మాజీ ఏపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ వ్యక్తి పూజ ఉండకూడదన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు.. పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

ఇదీ చదవండి

చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడిన అమిత్ షా

ABOUT THE AUTHOR

...view details