ఆంధ్రప్రదేశ్

andhra pradesh

డంపింగ్​ యార్డులో అగ్ని ప్రమాదం.. సమీప గ్రామస్థులకు ఇబ్బందులు

By

Published : Apr 9, 2021, 3:49 PM IST

విజయవాడ పాతపాడులోని డంపింగ్​ యార్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చుట్టుపక్కల కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు అలుముకోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు.

fire accident at vijayawada
డంపింగ్​ యార్డులో అగ్ని ప్రమాదం.. ఇబ్బంది పడుతున్న సమీప గ్రామస్తులు

విజయవాడ నగర శివారు మున్సిపల్ కార్పొరేషన్​కు చెందిన పాతపాడు డంపింగ్ యార్డ్​లో చెత్త తగలబడింది. దీంతో కిలోమీటర్ల దూరం వరకు దట్టమైన పొగలు వ్యాపించాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, మామిడి తోటల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంఘటనాస్థలానికి చేరుకున్న పాయికాపురం అగ్నిమాపక వాహనంతోపాటు వీఎంసీకి చెందిన 10 వాటర్ ట్యాంకర్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం డంపింగ్ యార్డులో ఇదే కాలంలో ఏర్పడుతున్న మంటలు తమకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని మామిడి తోటల యజమానులు వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details