ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వారాహి వాహనానికి నిషేధిత రంగు: పేర్ని నాని

By

Published : Dec 9, 2022, 11:50 AM IST

PERNI NANI COMMENT: వారాహితో యుద్ధానికి సిద్ధం అంటూ పవన్‌ కల్యాణ్‌ తీసుకొచ్చిన వాహనానికి నిషేధిత రంగు వేశారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. మిలటరీ వాహనాలకు వాడే ఆలివ్‌ గ్రీన్‌ రంగును ప్రైవేటు వాహనాలకు వినియోగించడం నిషిద్ధమని చట్టం స్పష్టంగా చెబుతోందని తెలిపారు.

PERNI NANI
PERNI NANI

PERNI NANI COMMENTS : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచార రథం వారాహి రంగుపై మాజీ మంత్రి పేర్ని నాని అభ్యంతరం తెలిపారు. మిలటరీ వాహనాలకు వాడే ఆలివ్‌ గ్రీన్‌ రంగును ప్రైవేటు వాహనాలకు వినియోగించడం నిషిద్ధమని చట్టం స్పష్టంగా చెబుతోందని తెలిపారు. అదే రంగు ఉంటే రిజిస్ట్రేషన్‌ అవ్వదని.. మీరు ఎటూ రంగు మార్చాలి కదా.. అదేదో పసుపు రంగు వేసుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు.

NANI ON STATE DIVISION ISSUE : తెలుగు రాష్ట్రాల విభజనపై అధికార వైసీపీ నేతలు తలోరీతిగా మాట్లాడారు. విభజన తీరు సరిగ్గా లేదని, విడిపోయిన తెలుగు రాష్ట్రాలను కలిపేందుకు ఏ అవకాశం ఉన్నా వినియోగించుకుంటామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడగా.. కొన్ని గంటల వ్యవధిలోనే మాజీ మంత్రి పేర్ని నాని అందుకు విరుద్ధంగా మాట్లాడారు. రాష్ట్ర విభజన ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం జరిగిపోయిందని, విడిపోయాక ఎవరి పాలన వారు చేసుకుంటున్నారని, ఇప్పుడు రెండు రాష్ట్రాలను కలపాలన్నా.. కుదరదని వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణ నేతలు విమర్శలు చేయడం, ఈ అంశాన్ని రాజకీయంగా వినియోగించుకోవడం సరైంది కాదని తెలిపారు. విభజన చట్టంలో పెండింగ్ సమస్యలపై పోరాడతామన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details