ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బందరు ఓడరేవు డీపీఆర్‌ సిద్ధం!

By

Published : Jan 8, 2020, 7:10 AM IST

బందరు ఓడరేవు నిర్మాణం అంశంలో తాజాగా కదలిక వచ్చింది. ఓడరేవు నిర్మాణంపై రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రైట్స్‌ సంస్థ(రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌) ప్రతినిధులు రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)కు మంగళవారం వివరించారు. కలెక్టర్‌ నివాసంలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎలాంటి ప్రైవేటు భూమి సేకరించకుండానే బందరు ఓడరేవు నిర్మాణం చేస్తామని వెల్లడించారు. ఈ నివేదికను ఇంతకు ముందే సంస్థ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించింది.

బందరు ఓడరేవు డీపీఆర్‌ సిద్ధం!
బందరు ఓడరేవు డీపీఆర్‌ సిద్ధం!

డీపీఆర్‌లోని ముఖ్యాంశాలు

  • తొలిదశలో రూ.1,040 కోట్లతో, 26.12లక్షల టన్నులు సరకు రవాణా సామర్థ్యంతో నాలుగు బెర్తులు నిర్మాణం. 2024-2025 నాటికి పూర్తి.
  • 2034-35 సంవత్సరానికి పోర్టును విస్తరించి ఎగుమతులు, దిగుమతుల లక్ష్యం 80.69 లక్షల టన్నులకు చేరుకోవాలి.
  • ఓడరేవును 1,484 ఎకరాల ప్రభుత్వ భూమిలోనే నిర్మిస్తారు.
  • బందరు ఒడరేవు సహజసిద్ధంగా ఏర్పడింది కాదు. ఇక్కడ డీప్‌ వాటర్‌ లేదు. దీంతో సముద్రంలో లోతు కోసం ఇసుక తవ్వకానికి(డ్రెడ్జింగ్‌) సింహభాగం ఖర్చు చేయాలి. రూ.1,189కోట్లు ఇందుకు ఖర్చు అవుతాయి.
  • బ్రేక్‌వాటర్‌ పనులకు రూ.570 కోట్లు, స్టాక్‌ యార్డు కోసం రూ.260 కోట్లు ఖర్చు చేయనున్నారు.
  • కార్గో హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌ నిర్మాణానికి రూ.400 కోట్లు అంచనా వేశారు. మిగిలిన రూ.1,005 కోట్లతో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారు.

కోర్టులో కేసు
బందరు పోర్టు విషయంలో ప్రస్తుతం ప్రతిష్టంభన నెలకొని ఉంది. గత ప్రభుత్వం నవయుగ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. నిర్మాణం ప్రారంభించలేదనే కారణంతో రద్దు చేయగా నవయుగ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వ్యాజ్యం నడుస్తోంది. ఇది తేలితేగానీ పోర్టు నిర్మాణం విషయంలో స్పష్టత వచ్చే అవకాశం లేదు.

ABOUT THE AUTHOR

...view details