ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CPI: 'కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ఈఎన్సీ సరిగ్గా వ్యవహరించడం లేదు'

By

Published : Jul 30, 2021, 8:21 PM IST

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ఈఎన్సీ సరిగా వ్యవహరించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. నీళ్లు సముద్రంలోకి కలిసినా పర్లేదుగానీ పోతిరెడ్డిపాడుకు ఇవ్వొద్దని తెలంగాణ ఈఎన్సీ కృష్ణా బోర్డుకు చెప్పటం దుర్మార్గమని మండిపడ్డారు.

సీపీఐ రామకృష్ణ

రాయలసీమ ప్రాంతానికి సాగునీరు, చెన్నైకి తాగునీరు ఇవ్వడం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే సాధ్యమని గుర్తుచేశారు. భేషజాలు లేవన్న జగన్, కేసీఆర్​లు ఇప్పుడు నదీజలాల విషయంలో వివాదాలు సృష్టిస్తున్నారన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన కృష్ణా జలాల అంశాన్ని కేంద్రానికి అప్పగించారని విమర్శించారు.

ఇదీ చదవండి:
Bank Holidays: ఆగస్టులో బ్యాంకు సెలవులు ఇవే..

ABOUT THE AUTHOR

...view details