ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ramakrishna: 'ప్రజాధనం దుర్వినియోగంపై సీఎం జగన్‌ నైతిక బాధ్యత వహించాలి'

By

Published : Jul 9, 2021, 3:05 PM IST

ఏపీ ఆర్థికశాఖ(AP Ministry of Finance )లో నిధుల దుర్వినియోగంపై కాగ్(Comptroller and Auditor General of India)​తో విచారణ చేయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(ramakrishna) డిమాండ్ చేశారు. ప్రజాధనం దుర్వినియోగంపై సీఎం జగన్‌ నైతిక బాధ్యత వహించాలని అన్నారు. ఆర్థికశాఖలో సరైన లెక్కలు లేవని పీఏసీ ఛైర్మన్ నిన్న గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు.

cpi leader ramakrishna
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ఏపీ ఆర్థికశాఖ(AP Ministry of Finance )లో నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రూ.41 వేల కోట్లు దుర్వినియోగం, జమ, ఖర్చుల నిర్వహణ లోపాలపై ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. ఆర్థికశాఖలో సరైన లెక్కలు లేవని పీఏసీ ఛైర్మన్ నిన్న గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజాధనం దుర్వినియోగంపై సీఎం జగన్‌ నైతిక బాధ్యత వహించాలని ఆయన వ్యాఖ్యానించారు. కాగ్‌(Comptroller and Auditor General of India)​తో ప్రత్యేకంగా ఆడిట్ చేయించాలని ఆయన కోరారు.

నిన్న పీఏసీ ఛైర్మన్ ఫిర్యాదు..!

రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ.41,043.18 కోట్ల ఖర్చుకు లెక్కాపత్రం లేదని, జమా ఖర్చులు సరిగా లేవని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌(Governor Bishwabhushan Harichandan)కి నిన్న తెదేపా సీనియర్‌ నేత, ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌(Payyavala Keshav)ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంలో ఒక చిరుద్యోగి వంద రూపాయలు ఖర్చుపెట్టాలన్నా వోచర్‌ రాయాలి. ఒక ప్రభుత్వ అధికారికి జీతం రావాలన్నా వంద సంతకాలు కావాలి. అలాంటిది రూ.41వేల కోట్లను ఎలాంటి రసీదులు, వోచర్లు లేకుండా వివిధ పద్దుల్లోకి మార్చేశారు.

మొత్తం ఒక శాఖ వ్యవహారాలే లోపభూయిష్టంగా ఉన్నాయని చెప్పడం ఇదే మొదటిసారి. ఈ సొమ్ము తినేశారని మేం అనడం లేదు. జమాపద్దులన్నీ నిబంధనల ప్రకారం లేకపోతే తినేసినా పట్టుకోలేరు. నిబంధనల్ని అమలు చేయాల్సిన ఉన్నతాధికారులే వాటిని ఉల్లంఘిస్తే, క్షేత్రస్థాయిలో అవకతవకల్ని ఎవరు నియంత్రిస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదెలా జరిగిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య అకౌంటెంట్‌ జనరల్‌ మే నెలలో రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌కి రాసిన లేఖను కేశవ్‌ గవర్నర్‌కు అందజేశారు.

ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ లేఖలో ఇలా..

ట్రెజరీ తనిఖీ కోసం మా బృందం ఈ ఏడాది మార్చి 22 నుంచి 26 వరకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌, దాని పరిధిలోని వివిధ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించింది. 10,806 బిల్లులకు సంబంధించి రూ.41,043.08 కోట్లను ట్రెజరీ కోడ్‌ నిబంధనలను పాటించకుండా స్పెషల్‌ బిల్లుల కేటగిరీలో డ్రా చేసినట్టు గుర్తించింది. అవి దేనికి ఖర్చు చేశారన్న వర్గీకరణ, డీడీఓ, లబ్ధిదారుల వివరాలు, మంజూరు, ప్రొసీడింగ్స్‌ వివరాలు, సబ్‌వోచర్లు వంటివేమీ లేవు. వివిధ ఖజానా కార్యాలయాల పరిధిలో 8,614 స్పెషల్‌ బిల్లుల కింద రూ.224.28 కోట్లు చెల్లించారు, మరో 2,164 బిల్లులకు సంబంధించి రూ.40818.79 కోట్లు స్పెషల్‌ బిల్లుల కింద సర్దుబాటు చేశారు. ఆ బిల్లులన్నీ ట్రెజరీల ద్వారా రాలేదు. నిజానికి ట్రెజరీ అధికారుల సంతకంతోనే అవి జరగాలి. ఈ లోపాల్ని సరిదిద్దడానికి చర్యలు చేపట్టండి’ అని రావత్‌కి రాసిన లేఖలో ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌(Principal Accountant General)పేర్కొన్నారు.

ఇదీ చూడండి.రూ.41 వేల కోట్ల చెల్లింపులకు ఎలాంటి లెక్కాపత్రనం లేవు: పయ్యావుల

ABOUT THE AUTHOR

...view details