ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కృష్ణా జిల్లావ్యాప్తంగా సీఎం జగన్​ జన్మదిన వేడుకలు

By

Published : Dec 21, 2020, 6:54 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి జన్మదినం సందర్భంగా కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేక్​ కట్​ చేసి..సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.

CM Jagan's birthday celebrations
సీఎం జగన్​ జన్మదినం వేడుకలు

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నందిగామలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. లైన్స్ క్లబ్ ఆఫ్ నందిగామ, వైఎస్సార్ పార్టీ న్యాయ విభాగం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేశారు. వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి మొండితోక అరుణ్ కుమార్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

పలువురు నాయకులు, న్యాయవాదులు, వాహనాల డ్రైవర్లు, విద్యార్థులు రక్తదానం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం స్థానిక గాంధీ సెంటర్​లో సీఎం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్​ కట్​ చేసి..బాణాసంచా కాల్చి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మైలవరంలో..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్​రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ చేసి, తమ ప్రియతమ నేతకు శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వైకాపా కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు.

ఇదీ చదవండి:సీఎం జన్మదినం సందర్భంగా విద్యార్థినిని దత్తత తీసుకున్న ఎమ్మెల్యే రోజా

ABOUT THE AUTHOR

...view details