ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొవిడ్ బారిన పడిన ఎం.డి హిదాయత్​కు ఫోన్​లో చంద్రబాబు పరామర్శ

By

Published : May 9, 2021, 10:00 PM IST

ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, తెదేపా నాయకుడు ఎం.డి హిదాయత్​ను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ ద్వారా పరామర్శించారు. హిదాయత్​కు ఇటీవలే కరోనా సోకింది.

చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, తెదేపా నాయకులు ఎం.డి హిదాయత్​ను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ ద్వారా పరామర్శించారు. ఇటీవల కొవిడ్‌ బారిన పడిన హిదాయత్.. ప్రస్తుతం గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్లతో మాట్లాడి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. గుండె నిబ్బరంతో కరోనాను జయించాలని, ఏ అవసరమొచ్చినా పార్టీ అండగా నిలుస్తుందని చంద్రబాబు హిదాయత్​కు భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details