ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సచివాలయ కార్యదర్శులకు బెదిరింపులు..వైకాపా నాయకుడిపై కేసు నమోదు

By

Published : Feb 26, 2022, 10:28 AM IST

సచివాలయ కార్యదర్శులను బెదిరించిన కేసులో గుడివాడ వైకాపా మాజీ కౌన్సిలర్ రవికాంత్​పై కేసు నమోదైంది. రవికాంత్ అనుచరులు దాడికి దిగుతున్నారంటూ సచివాలయ కార్యదర్శులు.. డీఎస్పీ సత్యానందంకు ఫిర్యాదు చేశారు.

case filed on yscrp ex councilor in gudivada
case filed on yscrp ex councilor in gudivada

కృష్ణా జిల్లా గుడివాడలోని వైకాపా మాజీ కౌన్సిలర్ చోరగుడి రవికాంత్​పై రెండో పట్టణ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. రవికాంత్ అతని అనుచరులు.. తరచూ దాడులకు దిగుతున్నారంటూ.. 24 వార్డు సచివాలయ కార్యదర్శులు గుడివాడ డీఎస్పీ సత్యానందంకు ఫిర్యాదు చేశారు.

ఎప్పుడు ఏం జరుగుతుందోనని.. దినదిన గండంలా విధులు నిర్వహించాల్సి వస్తుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. వారిచ్చిన ఫిర్యాదుతో వైకాపా మాజీ కౌన్సిలర్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details