ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వృద్ధురాలిపై హత్యాయత్నం.. నిందితుడు అరెస్ట్

By

Published : Dec 13, 2020, 4:09 PM IST

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం దంటగుంట్లలో వృద్ధురాలిపై హత్యాయత్నం కేసును హనుమాన్​ జంక్షన్​ పోలీసులు ఛేదించారు. నాలుగు బృందాలుగా విడిపోయి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను చోరీ చేసిన రూ.4 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

attempted murder case Accused arrested
హత్యాయత్నం కేసు నిందితుడు అరెస్ట్

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం దంటగుంట్లలో నమోదైన వృద్ధురాలిపై హత్యాయత్నం కేసును హనుమాన్ జంక్షన్ పోలీసులు 12గంటల్లోనే ఛేదించారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్​ ఆదేశాల మేరకు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలించారు. చోరీతో పాటు హత్యాయత్నం చేసిన నిందితుడు హరీష్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ చేసిన రూ.4 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన హనుమాన్ జంక్షన్ పోలీసులను ఎస్పీ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details