ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గన్నవరం విమానాశ్రయం విస్తరణకు పరిపాలన అనుమతులు జారీ

By

Published : Dec 24, 2020, 5:19 PM IST

గన్నవరం విమానాశ్రయ విస్తరణ అడ్డంకులను అధిగమించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. విస్తరణతో ఇబ్బందులకు గురవుతున్న 423 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను పరిశ్రమలు, మౌలిక సదుపాయల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలెవన్ వెల్లడించారు.

Administrative clearances issued for expansion of Gannavaram Airport in krishna district
గన్నవరం విమానాశ్రయం విస్తరణకు పరిపాలన అనుమతులు జారీ

గన్నవరం విమానాశ్రయం విస్తరణ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. విమానాశ్రయం విస్తరణలో ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు రూ.112.75 కోట్లతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.

నిర్వాసితులకు ప్లాట్ల కేటాయింపు...

కృష్ణా జిల్లాలోని బుద్ధవరం, దావాజీగూడెం, అల్లపురం గ్రామాల్లో విమానాశ్రయ విస్తరణ కారణంగా ప్రభావితమయ్యే 423 కుటుంబాలకు ప్లాట్లను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తక్షణ ప్రాతిపదికన అజ్జంపూడిలో స్థలాలు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. బాధిత కుటుంబాలకు రూ.57.20 కోట్ల మేర పరిహారాన్ని అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. యాన్యూటీ నిమిత్తం రూ.42.94 కోట్లను కేటాయిస్తున్నట్టు పరిశ్రమలు, మౌలిక సదుపాయల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలెవన్ అన్నారు. విమానాశ్రయ విస్తరణ కోసం ప్రభుత్వం 837 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ప్రాతిపదికన సమీకరించింది.

ఇదీచదవండి.

గండికోట నిర్వాసితులకు క్షమాపణలు కోరిన సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details