ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Serving Free Food: అభాగ్యుల ఆకలి తీరుస్తూ.. పదేళ్లుగా నిత్యాన్నదానం

By

Published : Dec 18, 2021, 4:11 PM IST

Serving Free Food: 'అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న' అనే నానుడి స్ఫూర్తితో.. పదేళ్లుగా రోజూ పదుల మంది ఆకలి తీరుస్తున్నారు ఓ విశాల హృదయుడు. దాతల సాయంతో కొన్ని రోజులు, ఇతరుల సహకారము లేనప్పుడు సొంత డబ్బుతో.. అభాగ్యుల కడుపు నింపుతున్నారు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి అభాగ్యుల కడుపు నింపుతోన్న చిట్టా ప్రసాద్​పై "ఈటీవీ భారత్" ప్రత్యేక కథనం.

అభాగ్యుల ఆకలి తీరుస్తూ..పదేళ్లుగా నిత్యాన్నదానం
అభాగ్యుల ఆకలి తీరుస్తూ..పదేళ్లుగా నిత్యాన్నదానం

అభాగ్యుల ఆకలి తీరుస్తూ..పదేళ్లుగా నిత్యాన్నదానం

Serving Free Food:కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన చిట్టా ప్రసాద్ కొన్నేళ్ల క్రితం తనకు ఎదురైన ఓ అనుభవంతో ఆకలి విలువ తెలుసుకున్నారు. చేతినిండా డబ్బు ఉన్నప్పుడు కూడా ఓ రోజు ఆయనకు ఎక్కడా, ఏ హోటల్​లోనూ భోజనం లభించలేదు. డబ్బు ఉన్నవారి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ఎవరూ లేని అభాగ్యులు, యాచకులు, వృద్ధుల పరిస్థితి ఏంటా అని ఆలోచించారు. దాని ఫలితమే.. పదేళ్లుగా రోజుకు సుమారు 40 మంది ఆకలి తీరుస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ రోజుకు 200 మందికి 2 పూటలా ఆహారమందించారు.

ప్రసాద్ చేస్తున్న మంచి పనికి స్థానికులు, స్వచ్ఛంద సేవకులందరూ తలో చేయి వేశారు. తమకు చేతనైన సాయం చేస్తున్నారు. 10 మంది ఆకలిని తీర్చడం తనకు ఎంతో ఆనందంగా ఉందని.. తన ఊపిరి ఉన్నంతవరకు ఈ అన్నదానం కార్యక్రమం కొనసాగిస్తానని ప్రసాద్ అంటున్నారు. అన్నదానానికి ఎవరైనా దాతలు విరాళాలు ఇస్తే వారి పేరున కూడా మరింత మంది కడుపు నింపుతానని చెబుతున్నారు.

ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టడానికి పేదరికం అడ్డు కాదని..సొంత ఇల్లు లేకపోయినా అద్దె ఇంట్లో ఉంటూ అన్నదానం నిర్వహిస్తున్న చిట్టా ప్రసాద్ సేవలు అభినందనీయమని స్థానికులు అంటున్నారు.

ఇదీ చదవండి

కాసేపట్లో పెళ్లి.. వరుడ్ని చితకబాదిన వధువు కుటుంబం

ABOUT THE AUTHOR

...view details