ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కోనసీమలో పంట విరామంపై కదిలిన యంత్రాంగం.. రైతుల ఖాతాల్లోకి రూ.120కోట్లు జమ

By

Published : Jun 9, 2022, 8:45 AM IST

రైతులు పంటవిరామం ప్రకటించడంతో అధికార యంత్రాంగం మేల్కొంది. ఖరీఫ్‌లో పంట వేయబోమంటూ కొందరు రైతులు తీర్మానాలు చేశారు. దీనిపై ‘ఈనాడు’లో ‘విరామమెరుగని వేదన’, ‘ధాన్యాగారంలో.. దైన్య స్థితి’ శీర్షికలతో ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించారు. బుధవారం కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా.. కొందరు అధికారులతో కలిసి పలు మండలాల్లో పర్యటించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి డబ్బుల విడుదలకు హామీ ఇచ్చి అమరావతి స్థాయిలో ఉన్నతాధికారులతో చర్చించి రూ.120 కోట్ల విడుదలకు కృషిచేశారు.

officials responded over crop break announcement in konaseema
కోనసీమలో పంట విరామంపై కదిలిన యంత్రాంగం

రైతులు పంటవిరామం ప్రకటించడంతో అధికార యంత్రాంగం మేల్కొంది. ఖరీఫ్‌లో పంట వేయబోమంటూ కొందరు రైతులు తీర్మానాలు చేశారు. దీనిపై ‘ఈనాడు’లో ‘విరామమెరుగని వేదన’, ‘ధాన్యాగారంలో.. దైన్య స్థితి’ శీర్షికలతో ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించారు. 2011లో మాదిరిగా పంటవిరామాన్ని ఉద్ధృతం చేసే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

బుధవారం కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, అమలాపురం అర్డీవో వసంతరాయుడు, డ్రెయిన్ల అధికారులతో కలసి అల్లవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాల్లో పర్యటించారు. ప్రధాన డ్రెయిన్లు, మురుగు కాలువలు, ప్రధాన పంట కాలువలు, ముంపునీరు సముద్రంలోకి దిగే సముద్ర మొగ ప్రాంతాలను పరిశీలించారు.

పంట విరామం ఆలోచన విరమించుకోవాలి: కలెక్టర్‌
కోనసీమలో కొన్ని మండలాల్లో రైతులు పంటవిరామం అంటున్నారని, ఆ అలోచన విరమించుకుని సాగు చేపట్టాలని కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా కోరారు. సాగుకు అవసరమైన వసతులన్నీ రైతులకు కల్పిస్తామన్నారు. ప్రభుత్వపరంగా అన్నివిధాలా సాయం చేస్తామని, వారం రోజుల్లో మురుగు కాలువల్లో పూడికతీత పనులు చేయిస్తామని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పంట కాలువలకు సాగు నీరు విడుదల చేసినందున రైతులు ఖరీఫ్‌ పనులు ఆరంభించాలని కలెక్టర్‌ కోరారు.

రైతుల ఖాతాల్లోకి ధాన్యం సొమ్ములు.. కోనసీమలోని 13 మండలాల్లో 198 రైతుభరోసా కేంద్రాల పరిధిలో సేకరించిన ధాన్యానికి 5,500 మంది రైతులకు రూ.120 కోట్లను ప్రభుత్వం బుధవారం వారి ఖాతాల్లో జమచేసినట్లు పౌరసరఫరాల సంస్థ డీఎం ఆర్‌.తనూజ తెలిపారు. కోనసీమ వ్యాప్తంగా జిల్లా కలెక్టర్‌ హిమాన్షుశుక్లా అధికారులతో కలిసి బుధవారం పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి డబ్బుల విడుదలకు హామీ ఇచ్చి అమరావతి స్థాయిలో ఉన్నతాధికారులతో చర్చించి రూ.120 కోట్ల విడుదలకు కృషిచేశారు. దీంతో కోనసీమలోని ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం, అయినవిల్లి, అంబాజీపేట, పి.గన్నవరం, రాజోలు, మలికిపురం, మామిడికుదురు, సఖినేటిపల్లి మండలాల పరిధిలోని రైతుల నుంచి ఈ నెల 7వ తేదీ వరకు సేకరించిన ధాన్యానికి వారందరి ఖాతాల్లో డబ్బులు జమచేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details