ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్​ చాకచక్యంతో..

By

Published : Nov 22, 2022, 7:40 PM IST

Bus Accident : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొనసీమ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో.. అదుపు చేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు కాకినాడ నుంచి మచిలీపట్నం వెళ్తుండగా దిండి జాతీయరహదారిపై ప్రమాదం జరిగింది.

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

Bus Accident : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొనసీమ జిల్లా మలికిపురం మండలం దిండి 216 జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కాకినాడ నుంచి మచిలీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. దిండి 216 జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి.. రోడ్డు దిగి పక్కకు దూసుకెళ్లింది. అక్కడ రహదారి విస్తీర్ణం పనుల నేపథ్యంలో.. ఒకేవైపు రాకపోకలు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 15మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details