ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట.. ఇంటి వద్దే విచారణకు ఆదేశం

By

Published : Nov 16, 2022, 5:11 PM IST

HIGH COURT ON EX MINISTER NARAYANA : మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్​ నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మాజీమంత్రి నారాయణపై సీఐడి కేసు నమోదు చేసింది.

HC ON EX MINISTER NARAYANA
HC ON EX MINISTER NARAYANA

HC ON EX MINISTER NARAYANA : హైకోర్టులో మాజీ మంత్రి నారాయణకు ఊరట దక్కింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మాజీమంత్రి నారాయణపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ కేసులో సాక్షిగా విచారణకు రావాలంటూ.. 160 సీఆర్పీసీ నోటీసు ఇచ్చింది. ఈ నోటీసులపై మాజీమంత్రి నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నారాయణ అనారోగ్యంతో ఉన్నారని.. ఇటీవల శస్త్రచికిత్స జరిగిందని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. 65 ఏళ్ల వయస్సులో సీఐడీ విచారణకు హాజరుకాలేరని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. నారాయణను హైదరాబాద్​లోని ఆయన స్వగృహంలో విచారించుకోవచ్చని సీఐడీకి స్పష్టం చేసింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details