ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పుష్కర ఎత్తిపోతల పథకం నిర్వహణ లోపం - వేల ఎకరాల్లో బీళ్లుగా మారిన పంట పొలాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 9:52 AM IST

Updated : Nov 9, 2023, 12:21 PM IST

Government Careless on Pushkara Lift Irrigation Scheme: రాయలసీమ ప్రాంతంలోనే కాదు.. గోదావరి జిల్లాల్లోనూ సాగునీరులేక పంటలు ఎండిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు.. పాలకుల నిర్లక్ష్యంతో వందలాది ఎకరాల్లో పంటను రైతులు కోల్పోయారు. కాకినాడ జిల్లా మెట్ట ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కరవు ఛాయలు కమ్ముకున్నాయి. పుష్కర ఎత్తిపోతల పథకం పడకేయడంతో సుమారు 42వేల ఎకరాలు బీళ్లుగా మారిపోయాయి. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.

Government_Careless_on_Pushkara_Lift_Irrigation_Scheme
Government_Careless_on_Pushkara_Lift_Irrigation_Scheme

పుష్కర ఎత్తిపోతల పథకం నిర్వహణ లోపం - వేల ఎకరాల్లో బీళ్లుగా మారిన పంట పొలాలు

Government Careless on Pushkara Lift Irrigation Scheme :కాకినాడ జిల్లా మెట్ట ప్రాంత వరప్రదాయనిగా పేరుగాంచిన పుష్కర ఎత్తిపోతల పథకం (Pushkara Lift Irrigation Scheme)పై ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతుల పాలిట శాపంగా మారింది. పైపుల నిర్వహణపై శాశ్వత పనులు చేపట్టకపోవడం, తాత్కాలికంగా చేసిన పనులు బెడిసి కొట్టడంతో ఈ సీజన్‌లో సాగు నీరు అందించలేకపోయారు. ఫలితంగా 42వేల ఎకరాల్లో పంట ఎండిపోయింది. పుష్కర ఎత్తిపోతల పథకం కింద తాళ్లూరు, రాజపూడి పంపింగ్ స్కీం (Talluru, Rajpoodi Pumping Scheme)లు ఉన్నాయి. తాళ్లూరు లిఫ్ట్ పరిధిలో 37వేల ఎకరాలు, రాజపూడి పంపింగ్ స్కీం కింద మరో 5,526 ఎకరాల ఆయకట్టు ఉంది.

Crops Drying Duo to Lack of Irrigation Water : తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి గోదావరి జలాలు ఎత్తిపోసి ఖరీఫ్ సీజన్‌ (Kharif Season)లో మెట్ట ప్రాంతంలోని పొలాలకు నీరు అందించేవారు. నిర్వహణ లోపంతో ఈ ఏడాది పుష్కర ఎత్తిపోతల పథకం పైపులు తరచూ మరమ్మతులకు గురవ్వడంతోసాగు నీరు (Irrigation Water) నిలిపివేశారు. పాలకుల మాటలు నమ్మి సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.

మూలన పడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు.. సాగునీటి కోసం రైతుల చూపులు

Kakinada District Drought :జగ్గంపేట, గండేపల్లి మండలాల్లోని వేల ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. పంటల్ని కాపాడుకునేందుకు కొన్ని చోట్ల ఏలేశ్వరం నుంచి సరఫరా అయ్యే రక్షిత తాగు నీటిని ఇంజిన్ల ద్వారా రైతులు పొలాలకు మళ్లిస్తున్నారు. మరి కొందరు వేల రూపాయలు ఖర్చు పెట్టి చెరువుల్లో ఉన్న అరకొర నీటిని పొలాలకు పంపిస్తున్నారు.

Kakinada District Farmers Problems :పుష్కర ఎత్తిపోతల పథకంలోని తాళ్లూరు, రాజపూడి పంపింగ్ స్కీం పైపులు పగిలిపోవడం వల్లే ఈ ఏడాది తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. పుష్కర ఎత్తిపోతల పథకం నిర్వహణకు 35 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. కలెక్టర్‌ CSR నిధుల కింద విడుదల చేసిన 28 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేసినా వారం రోజులకే మళ్లీ పైపులు పగిలిపోయాయి. ఎండిన పంటపొలాలను తెలుగుదేశం నేత జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ జనసేన నేత సూర్యచంద్ర సైతం తొమ్మిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష (Hunger Strike) చేశారు.

కరువుకాటుకు కళ్లెదుటే ఎండిపోతున్న పంటను దున్నేసిన రైతు - పెట్టుబడి, రెక్కల కష్టం మట్టిపాలు

ఎండిపోయిన పంటలను అధికారులు పరిశీలించి కలెక్టర్‌కు నివేదించారు. ఎకరాకు 26వేల రూపాయల పరిహారం చెల్లించాలంటూ ఉన్నతాధికారులకు ప్రాథమిక అంచనాలు పంపినట్లు సమాచారం.

ప్రకృతి కరుణించలేదు, పాలకులు కనికరించడం లేదు - కరవు మండలాల ప్రకటనలో వివక్షపై రైతన్న ఆవేదన

Last Updated :Nov 9, 2023, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details