ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అధికారం కోసమే లోకేష్ పాదయాత్ర.. మంత్రుల విసుర్లు

By

Published : Jan 29, 2023, 8:22 AM IST

Lokesh Yuvagalam: చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర మొదలుఅయ్యినప్పటి నుంచి అధికార పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రులు రోజా, విడదల రజని, అంబటి రాంబాబు ఆయనపై వ్యాఖ్యలు చేశారు.

యువగళం
Lokesh Yuvagalam

Lokesh Yuvagalam: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైఎస్సార్​సీపీ మంత్రులు విమర్శలు గుప్పించారు. ఎలాంటి సెంటిమెంట్‌ లేని నారా లోకేశ్‌... కేవలం అధికారం కోసం మాత్రమే పాదయాత్ర చేస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. ఏ విషయంలోనూ స్పష్టత లేకుండా పాదయాత్ర చేస్తున్న నేతగా లోకేశ్ చరిత్రలో నిలిచిపోతారని మంత్రి విడదల రజని ఎద్దేవా చేశారు.

టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పోలీసులపై చేసిన వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కుప్పం సభలో అచ్చెన్నాయుడు మాట్లాడిన తీరు సరికాదన్న అంబటి.... నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో చిత్తశుద్ది లేదని ఆరోపించారు. టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు.

"నాన్నకే సెంటిమెంట్స్ లేవంటే కొడుక్కి అంతకన్నా లేవు. వాళ్లకు కేవలం డబ్బులు, అధికారం వాళ్లు బాగుంటే చాలు అనుకునేది మనకు స్పష్టంగా మరోసారి నిన్న కూడా కనిపించింది. నిన్న పాదయాత్ర స్టార్ట్ అవ్వగానే తారక రత్నకి సీరియస్​గా హార్టస్టోక్ వచ్చి పడపోతే కనీసం సెంటిమెంట్ లేకుండా పాదయాత్ర చేసుకుంటూ తరువాత పబ్లిక్ మీటింగ్​లో అధికార పక్షం వాళ్లని ముఖ్యంగా నన్ను మహిళని తిట్టి ఆనంద పడుతున్నారు. జగన్​మోహన్ రెడ్డిని మాట్లాడే అర్హత ఏ కోణంలో లోకేష్​కు లేదు." - మంత్రి రోజా

"లోకేష్ పాదయాత్ర చూస్తుంటే ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో, లక్ష్యం ఏంటో లోకేష్​కే స్పష్టం లేదని రాష్ట్ర ప్రజలకు స్ఫష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మన జగనన్న ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సంక్షేమ పథకాలని లోకేష్ ప్రశ్నించే పరిస్థితి లేదు. ప్రశ్నించలేరు." - మంత్రి విడదల రజని

"అచ్చెన్నాయుడు 500 మంది పోలీసులు వచ్చారని, ఏమీ చేయడానికి వచ్చారో ఒక భాషలో మాట్లాడారు. చాలా అభ్యంతరకరమైన భాష. ఈవాళ యువగళం పేరుతో వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కుమారుడికి ఏవధంగా ప్రజలు సమాధానం చేప్తారో ఆవిధంగా సమాధానం చెప్తారు."-మంత్రి అంబటి రాంబాబు

నారా లోకేష్ యువగళం​పై వైఎస్సార్​సీపీ మంత్రుల విమర్శల వర్షం

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details