ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చేబ్రోలులో నలుగురు దొంగలు అరెస్టు.. రూ.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

By

Published : Jun 30, 2020, 4:36 PM IST

గుంటూరు జిల్లాలో తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకుల్ని చేబ్రోలు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

guntur district
వరుస చోరీలు చేసిన యువకులు అరెస్టు

గుంటూరు జిల్లా చేబ్రోలు పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని ఆ ప్రాంత పోలీసులు అరెస్టు చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. వీరిలో ఇద్దరు మంగళగిరి, మరో ఇద్దరు చేబ్రోలుకు చెందినవారని చెప్పారు. వీరు చేబ్రోలు, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, తెనాలి రూరల్ ప్రాంతాల్లో పగలు ద్విచక్రవాహనంపై రెక్కీ నిర్వహించేవారని అన్నారు. తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి రాత్రిపూట నలుగురు కలిసి దొంగతనం చేస్తూ ఉంటారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే చేబ్రోలు మండలం మంచాల, చేబ్రోలు దేవాలయాల్లో వరుస దొంగతనాలు జరగటంతో నిఘా పెట్టామని వెల్లడించారు. సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

నలుగురిలో మంగళగిరికి చెందిన పెండ్ర వెంకటేశ్వర్లు.. గతంలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉండి జైలు శిక్ష అనుభవించాడని చెప్పారు. తెనాలి జైలులో ఉండగా చేబ్రోలుకు చెందిన మానికల ఆంజనేయులుతో పరిచయం ఏర్పడింది. బయటకు వచ్చాక వెంకటేశ్వర్లు, గోపి, రావూరు పోతురాజు కలిసి ఐదు చోట్ల దొంగతనాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దొంగలించిన సొత్తును అమ్మలేక అలాగే ఉంచుకున్నారని అన్నారు. వారి నుంచి 20 సవర్ల బంగారం రెండున్నర కేజీల వెండి వస్తువులు, రూ. 25 వేలు నగదు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కేసును ఛేదించిన ఎస్ఐ లు సీహెచ్ కిషోర్, ఎం.రాజ్ కుమార్, ఎం.వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి, సిబ్బంది గణేష్ వెంకటనారాయణ, షరీఫ్. నాగరాజు, ధర్మరాజులకు రివార్డులు అందించారు. సమావేశంలో డీఎస్పీ కమలాకర్, ఇన్చార్జి సీఐ ఆనందరావు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

మత్తుతో చిత్తవుతున్న విద్యార్థులు...గుట్టుగా గంజాయి విక్రయాలు

ABOUT THE AUTHOR

...view details