ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పార్శిల్ యంత్రం షార్ట్ సర్క్యూట్​.. విద్యుదాఘాతంతో మహిళ మృతి

By

Published : Dec 18, 2020, 8:52 AM IST

గుంటూరు జిల్లా రేపల్లెలో.. శివకుమారి అనే మహిళ విద్యుదాఘాతంతో మరణించింది. బిర్యానీ పాయింట్​లో ఆమె పనిచేస్తుండగా.. పార్శిల్ యంత్రం షార్ట్ సర్క్యూట్​ జరిగింది. బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.

electric short circuit
విద్యుదాఘాతంతో మహిళ మృతి

పార్శిల్​ యంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా.. విద్యుదాఘాతంతో గుంటూరు జిల్లా రేపల్లెలో ఓ మహిళ మృతి చెందింది. కుమార్తె ఇంట్లోని బిర్యానీ పాయింట్​లో చేదోడువాదోడుగా పనిచేస్తున్న బొడ్డు శివ కుమారి.. ఆ సమయంలో యంత్రంతో పనిచేస్తూ ఉంది. ఆమె విద్యుదాఘాతానికి గురైనట్లు గమనించిన కుటుంబ సభ్యులు.. బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శివకుమారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details