ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఘనంగా వీరమ్మ పేరంటాళ్ల సిరిమానోత్సవం

By

Published : Feb 11, 2020, 2:39 PM IST

పెనుమూలిలో వీరమ్మ పేరంటాళ్ల తిరునాళ్లు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సిరిమాను ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.

Veeramma perantalla Sirimanotsavam
ఘనంగా వీరమ్మ పేరంటాళ్ల సిరిమానోత్సవం

ఘనంగా వీరమ్మ పేరంటాళ్ల సిరిమానోత్సవం

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెనుమూలిలో వీరమ్మ పేరంటాళ్ల తిరునాళ్లు ఘనంగా జరిగాయి. వేలాది మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. సిరిమాను ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు సిరిమానుకు బుట్ట కట్టి అందులో కూర్చుని విభూతి, పండ్లు కిందకు వేస్తారు. వాటిని పట్టుకున్న భక్తుల కోరికలు తీరతాయని ఇక్కడ ప్రజల విశ్వాసం. దీంతో విభూతి కొంగుల్లో పట్టుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details