ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఎవరు సహకరించినా, సహకరించకపోయినా తెలంగాణ అభివృద్ధి ఆగదు'

By

Published : Nov 12, 2022, 6:33 PM IST

kishan Reddy: ఎవరు సహకరించినా, సహకరించకపోయినా తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ధాన్యం కొనటం లేదంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.26 వేల కోట్లు వెచ్చించి కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తోందని కిషన్​రెడ్డి స్పష్టం చేశారు.

kishan Reddy
kishan Reddy

kishan Reddy Comments: సింగరేణిని ప్రైవేట్​పరం చేస్తారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సింగరేణిలో అత్యధిక వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. సింగరేణిని ప్రైవేట్​పరం చేసే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. గ్రామాల్లో రోడ్లు, పారిశుద్ధ్యానికి నిధులు ఇస్తుంది కేంద్ర సర్కారు అని పేర్కొన్నారు. ఈ 8 ఏళ్లల్లో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికీ వెళ్లి వివరిస్తామని చెప్పారు. కరోనా సమయంలో ప్రతి ఇంటికీ కేంద్రం ఉచితంగా 5 కిలోల బియ్యం ఇచ్చిందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు.

ఈ క్రమంలోనే ఎవరు సహకరించినా, సహకరించకపోయినా తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని కిషన్​రెడ్డి వెల్లడించారు. యూరియా మీద కేంద్రం భారీగా రాయితీ ఇస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనటం లేదంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం ధరను మోదీ ప్రభుత్వం రూ.2 వేలకు పైగా పెంచిందని గుర్తు చేశారు. రూ.26 వేల కోట్లు వెచ్చించి కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తోందని కిషన్​రెడ్డి వివరించారు.

కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమచేస్తున్నామని కిషన్​రెడ్డి చెప్పారు. 2014 నాటికి కేంద్రం 24 లక్షల కోట్ల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించిందని.. ఈరోజు కేంద్రం 142 లక్షల కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తోందని తెలిపారు. 2014 నాటికి రాష్ట్రంలో 2,500 కిలోమీటర్లు మాత్రమే జాతీయ రహదారులు ఉండేవని.. ఇవాళ రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తీర్ణం దాదాపు 5,000 కిలోమీటర్లకు చేరుకుందని వెల్లడించారు. రామగుండంలో 1,600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్క రామగుండంలోనే కేంద్రం రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తోందని కిషన్​రెడ్డి వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details