ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Textile Traders Complaint against MLA Mustafa: మరోసారి వివాదాస్పదంగా గుంటూరు ఎమ్మెల్యే వ్యవహారం.. వస్త్ర వ్యాపారులకు వేధింపులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2023, 11:40 AM IST

Updated : Sep 3, 2023, 2:33 PM IST

Textile Traders Complaint against MLA Mustafa: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది. నగరంలోని వాసవి కాంప్లెక్స్ ముందు దుకాణం ఏర్పాటు చేసేందుకు సిద్ధం కాగా.. వ్యాపారులంతా ఏకమై అడ్డుకున్నారు. దీంతో వెనక్కి తగ్గిన ఎమ్మెల్యే ముస్తఫా వేరేవిధంగా వ్యాపారుల్ని ఇబ్బందులు పెట్టడానికి యత్నిస్తున్నారు. వ్యాపారులంతా కలిసి మేయర్ కావటి మనోహర్​ని కలిసి ముస్తఫాపై ఫిర్యాదు చేయటంతో వ్యవహారం మరింత వేడెక్కింది.

textile_traders_complaint_against_mla_mustafa
textile_traders_complaint_against_mla_mustafa

Textile Traders Complaint against MLA Mustafa: మరోసారి వివాదాస్పదంగా గుంటూరు ఎమ్మెల్యే వ్యవహారం.. వస్త్ర వ్యాపారులకు వేధింపులు

Textile Traders Complaint against MLA Mustafa:గుంటూరు నగరంలో వస్త్రవ్యాపారులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న వాసవి కాంప్లెక్స్ ముందు ఓ దుకాణం ఏర్పాటు చేయాలనిఎమ్మెల్యే ముస్తఫా భావించారు. అక్కడ అన్నిరకాల వస్త్రాలు, రెడీమెడ్ దుస్తులు లభించడంతో అక్కడ ఎమ్మెల్యేకు చెందిన హెర్బల్ ఉత్పత్తులు అందులో విక్రయించాలనేది ఆలోచన. దాన్ని వ్యాపారులు వ్యతిరేకించారు. కాంప్లెక్స్ లోపలికి వెళ్లే మార్గంలో దుకాణం ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. అయినా వినిపించుకోకుండా శుక్రవారం రాత్రి కంటెయినర్‌ తీసుకొచ్చి పెట్టారు. ఆ దుకాణం తొలిగించకపోతే తామే తీసేస్తామని వ్యాపారవర్గాలు హెచ్చరించటంతో అక్కడి నుంచి తీసేశారు. ప్రస్తుతానికి వెనక్కి తగ్గినా మళ్లీ వచ్చి ఆక్రమిస్తారనే అనుమానంతో అక్కడి వ్యాపారులు ఇనుప కంచె ఏర్పాటుకు సన్నద్ధమయ్యారు. అందుకు అవసమరైన సామగ్రి తీసుకొచ్చారు.

MLA followers attack on Public: 'ఏంట్రా ఎక్కువ చేస్తున్నారు'.. స్థానికులపై ఎమ్మెల్యే అనుచరులు ఫైర్​

MLA Mustafa is troubling the textile traders:రహదారి పక్కన ఇనుప కంచెవేస్తే అడ్డుకోవాలని ఎమ్మెల్యే నగరపాలక అధికారులకు ఆదేశించారు. దీంతో వ్యాపారులు కంచె ఏర్పాటుని ఆపేశారు. ఎమ్మెల్యే ముస్తఫా తమను ఇబ్బందులు పెడుతున్నారని నగరపాలక సంస్థ మేయర్‌ కావటి మనోహర్‌నాయుడును కలిసి వ్యాపారులు ఫిర్యాదు చేశారు. షాపు పెట్టుకోవటానికి స్థలం అడిగితే నిరాకరించామని కక్ష పెంచుకున్నారని ఆవేదన వెలిబుచ్చారు. షాపింగ్ కాంప్లెక్స్ చుట్టూ వేర్వేరు దుకాణాలు పెట్టించాలనే ఆలోచనలో ఉన్నారని.. అదే జరిగితే తమ వ్యాపారాలు జరగవని ఆందోళన వ్యక్తం చేశారు.

YCP MLA Mustafa: వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా రచ్చ.. ఇంటాబయటా చర్చ..

Guntur Vasavi Complex Textile Traders Petition to Mayor:వ్యాపారవర్గాలకు అండగా నిలవాలని మేయర్​ని కోరారు. కరోనా సమయం నుంచి వ్యాపారాలు మందగించి ఇబ్బంది పడుతున్నామని.. ఇప్పుడు తమను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించటం సరికాదన్నారు. వ్యాపార సంఘ అసోసియేషన్‌ నాయకులు శ్రీనివాసరావు, సాంబశివరావు తదితరులు మేయర్‌కు వినతిపత్రం అందజేశారు. వ్యాపారులకు అన్ని విధాలా అండగా ఉంటామని, వ్యాపారుల్ని ఇబ్బంది పెట్టాలనేది తమ పార్టీ విధానం కాదని మేయర్ వారికి నచ్చజెప్పారు. ఈ వ్యవహారాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఇబ్బంది లేకుండా చూస్తామని మేయర్ హామీ ఇచ్చారు.

YSRCP MLA Mustafa: నేను అధికార పార్టీ ఎమ్మెల్యేనేనా..! గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఆవేదన

MLA Mustafa explanation on Vasavi Complex dispute:వాసవి క్లాత్‌ మార్కెట్‌ వద్ద బడ్డీ కొట్టు పెట్టుకుంటానని వైసీపీ కార్యకర్త అడిగాడని అందుకే తాను అక్కడ స్థలం అడిగినట్లు ముస్తఫా చెబుతున్నారు. కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టే స్థలం అడిగితే నా వ్యక్తిగతం కోసం అడిగినట్లు సృష్టించారన్నారు. దీనిపై వ్యాపారులు పెద్ద రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డు మీద ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తే నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు కొందరు తెలుగుదేశం నాయకులు ఈ వ్యవహారం వెనక ఉన్నారని.. తనకు వ్యతిరేకంగా వ్యాపారులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.

Last Updated : Sep 3, 2023, 2:33 PM IST

ABOUT THE AUTHOR

...view details