ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వైకాపా ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరిస్తోంది'

By

Published : Jun 19, 2020, 4:56 PM IST

వైకాపా ప్రభుత్వం బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని తెదేపా బీసీ నేతలు ఆరోపించారు. బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారిని అణగతొక్కాలని చూస్తున్నారని గుంటూరు జిల్లా మంగళగిరి పురపాలక సంఘం మాజీ ఛైర్మన్ గంజి చిరంజీవి విమర్శించారు.

'వైకాపా ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరిస్తోంది'
'వైకాపా ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరిస్తోంది'

తెదేపాకు చెందిన బీసీ నేతలపై ముఖ్యమంత్రి జగన్ తప్పుడు కేసులు పెడుతున్నారని గుంటూరు జిల్లా మంగళగిరి పురపాలక సంఘం మాజీ ఛైర్మన్ గంజి చిరంజీవి విమర్శించారు. బీసీల ఓట్లతో గెలిచిన వైకాపా ఇప్పుడు వారిని పాతాళానికి తొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు.

రాబోయే రోజుల్లో బీసీ సంఘాలన్నీ ఏకమై.. పెద్దఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏ నేరం చేయకపోయినా.. తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని ఇది మంచి పద్ధతి కాదన్నారు.

ఇదీ చదవండి: వైకాపా మంత్రులపై తెదేపా ఎంపీ కనకమేడల ధ్వజం

ABOUT THE AUTHOR

...view details