ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరు తొక్కిసలాట ఘటనలో.. బాధిత కుటుంబాలకు టీడీపీ నేతమోహన్ కృష్ణ ఆర్థిక సహాయం

By

Published : Jan 21, 2023, 4:05 PM IST

TDP compensation to stampede victims
టీడీపీ నేత మన్నవ మోహన్ కృష్ణ ()

TDP compensation to stampede victims: గుంటూరు తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలకు టీడీపీ నేతలు ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ ఘటనలో మరణించిన ఒక్కొక్క కుటుంబానికి మన్నవ మోహన్ కృష్ణ ట్రస్ట్ తరపున 3లక్షల 34 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. నక్కా ఆనంద బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా మృతుల కుటుంబాలకు చెక్కులను అందజేశారు.

TDP compensation to stampede victims: గుంటూరు జనతా వస్త్రాల పంపిణి ఘటనలో మరణించిన కుటుంబాలకు టీడీపీ నేతలు అర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం నేతలు.. నక్కా ఆనంద బాబు, ఆలపాటి రాజేంద్రల చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించారు. అనంతరం టీడీపీ నేత నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. పోలీసులు, ప్రభుత్వ వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు.

గుంటూరులో ఉయ్యురు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనతా వస్త్రాల పంపిణి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు టీడీపీ నేత మన్నవ మోహన్ కృష్ణ ఆర్థిక సాయం అందించారు. మన్నవ మోహన్ కృష్ణ ట్రస్ట్ తరపున ఒక్కో కుటుంబానికి రూ.3.34 లక్షల చొప్పున... మొత్తం 10 లక్షల ఆర్ధిక సహాయం చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా బాధిత కుటుంబ సబ్యులకు చెక్కులను అందించారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ.... తొక్కిసలాట ఘటనపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందన్నారు. పోలీసులు, ప్రభుత్వ వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. ఘటన తర్వాత అనవసర కేసులతో టీడీపీ నాయకులను, సేవా కార్యక్రమలు చేపట్టే వారిని ఇబ్బంది పెడుతోందన్నారు. పేదలకోసం చేసే సేవా కార్యక్రమాలను సైతం ప్రభుత్వం ఓర్చుకోలేకపోతోందని విమర్శించారు. మరణించిన వారి కుటుంబాలకు టీడీపీ నాయకులు అండగా ఉంటుందని మోహన్ కృష్ణ హామీ ఇచ్చారు.

టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు గుంటూరులో జరిగిన తొక్కిసలాటకు సంభందించి మరణించిన కుటుంబాలకు.. ఆర్థిక సాయం ఇచ్చేందుకు టీడీపీ నేతలు ముందుకు వచ్చారు. ఆ ఘటనలో పోలీసుల అలసత్వం, ఇది కావాలనే ప్రభుత్వం, పోలీసులు కలిసి నాటకం ఆడారు. అందులో భాగంగా కందుకురూ, గుంటూరు ఘటనలు. పోలీసులు సరైన భద్రతాపరమైన చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం అనుసరించిన తీరు వల్లే ప్రమాధాలు చోటు చేసుకున్నాయి. అయితే మేము మాత్రం ఘటనపై స్పందించి మృతుల కుటుంబానికి అర్థికంగా అండగా ఉండేందుకు ముందుకు వచ్చాం. అదే ప్రభుత్వం రూ.2లక్షల ఆర్థికసాయం అందించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. నక్కా ఆనంద్ బాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు

మృతుల కుటుంబానికి అండగా ఉండేందుకు మా వంతుగా మండవ మోహన్ కృష్ణ ట్రస్ట్ తరపు నుంచి ఒక్కో కుటుంబానికి రూ.3.34 లక్షల చొప్పున... మొత్తం 10 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించాం. గుంటూరు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు టీడీపీ నాయకులు అండగా ఉంటారు. మన్నవ మోహన్ కృష్ణ, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి

మరణించిన వారి ఒక్కొక్క కుటుంబానికి 3లక్షల 34 వేల చొప్పున ఆర్థిక సాయం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details