ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Southwest Monsoon ఊరిస్తున్న రుతుపవనాల రాక.. చల్లబడుతున్న రాష్ట్రం..! తగ్గుతున్న ఉష్ణోగ్రతలు!

By

Published : Jun 10, 2023, 6:25 PM IST

Southwest Monsoon: ఒకటి రెండు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణాలకూ రుతుపవనాలు విస్తరిస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటన ప్రజల్ని కాస్తంత ఉపశమనాన్ని ఇస్తోంది. ఇప్పటికే కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నట్టు ఐఎండీ తెలిపింది. ఇటు రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణగాలుల ప్రభావం 24 గంటల్లో తగ్గుముఖం పట్టే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్రతుపాను బిపర్ జోయ్ గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్టు ఐఎండీ తెలిపింది.

Etv Bharat
Etv Bharat

Southwest Monsoon: నైరుతీ రుతుపవనాలు క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడులోని వవిధ ప్రాంతాలకు విస్తరించినట్టు భారత వాతావరణ విభాగం తెలియచేసింది. రాగల 24 గంటల్లో బంగాళాఖాతంతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, సిక్కీ, పశ్చిమబెంగాల్ తదితర ప్రాంతాలకూ విస్తరించనున్నట్టు తెలియచేసింది. కర్ణాటక, తమిళనాడులోని అన్ని ప్రాంతాలకూ విస్తరించిన అనంతరం ఒకటీ రెండు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణాలకూ రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నట్టు ఐఎండీ తెలిపింది. అటు ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కీంరాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదు అయ్యే సూచనలు ఉన్నట్టు తెలిపింది.

కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణగాలుల ప్రభావం 24 గంటల్లో తగ్గుముఖం పట్టే అవకాశముందని ఐఎండీ తెలియచేసింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్రతుపాను బిపర్ జోయ్ గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్టు ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం ముంబైకి 630 కిలోమీటర్లు, గోవాకు 700కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో ఇది క్రమంగా గుజరాత్ తీరం వైపునకు కదులుతుందని స్పష్టం చేసింది. 24 గంటల అనంతరం ఇది వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది. దీంతో పశ్చిమతీర ప్రాంత రాష్ట్రాల్లో ఈ నెల 15 తేదీ వరకూ చేపలవేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరికలు జారీచేసింది.

ఈ నెల 10వ తేదీన నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మొత్తం భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతం లోని కొన్ని ప్రాంతాల్లోకి వాయువ్య బంగాళాఖాతం మరియు ఈశాన్య రాష్ట్రాలలోని చాలా ప్రాంతాల లోకి మరింత ముందుకు సాగాయి.

వచ్చే 48 గంటల్లో మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని భాగాలు, గోవా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలు, నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతం, కొన్ని వాయువ్య బంగాళాఖాతంలోని మరిన్ని భాగాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని మిగిలిన భాగాలు మరియు ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్ అలాగే సిక్కింలోని కొన్ని భాగాల లోకి నైరుతి రుతుపవనాలు మొత్తం మీదుగా మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

తూర్పు బీహార్ అలాగే పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ ఒడిశా వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి ఉంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ అలాగే దానికి ఆనుకుని ఉన్న ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడింది .

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు : ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈరోజు, రేపు అక్కడక్కడా వడ గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈదురు గాలులు గంటకు 30 - 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉందని.. అలాగే వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

ఎల్లుండి: తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని.. ఈదురు గాలులు గంటకు 30 - 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉందని చెప్పింది. గరిష్ట ఉష్ణో గ్రతలు సగటు ఉష్ణో గ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీ ల సెంటి గ్రేడ్ అది కంగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేెంద్రం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details