ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజధానిగా అమరావతినే కొనసాగించాలి: దళిత బహుజన ఐకాస

By

Published : Oct 10, 2020, 5:44 PM IST

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని దళిత బహుజన ఐకాస డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లా వెలగపూడిలోని రాజధాని పరిరక్షణ సమితి కార్యాలయంలో.. దళిత బహుజన రౌండ్​ టేబుల్ సమావేశానికి నిర్వహించారు. అమరావతి రైతుల ఆందోళనకు అండగా ఉండాలని ఐకాస తీర్మానం చేసింది.

దళిత బహుజన ఐకాస
దళిత బహుజన ఐకాస

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని దళిత బహుజన ఐకాస డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలోని రాజధాని పరిరక్షణ సమితి కార్యాలయంలో దళిత బహుజన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైకాపా మినహా అన్ని పార్టీలకు చెందిన ఎస్సీ నేతలు హాజరయ్యారు.

రేపు, ఎల్లుండి రాజధాని రైతులు నిర్వహించే ఆందోళనల్లో దళిత బహుజన ఐకాస నేతలు పాల్గొనాలని నిర్ణయించారు. రైతులు చేపట్టే ఉద్యమానికి అండగా నిలవాలని ఈ సమావేశంలో తీర్మానించారు.

ABOUT THE AUTHOR

...view details