ETV Bharat / state

'మళ్లీ పుట్టిన గాంధీ.. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి'

author img

By

Published : Oct 10, 2020, 3:15 PM IST

Updated : Oct 10, 2020, 4:32 PM IST

స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వాన్ని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. గతంలో ఏకగ్రీవం అయిన ఎన్నికలు స్వచ్ఛందం కాదని.. అవి నిర్బంధమని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రికి ఉన్నది కరోనా భయం కాదని.. డరోనా అని విమర్శించారు. జగన్ అభిమానించే కేసీఆర్ శాసనమండలి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని.. మళ్లీ పుట్టిన గాంధీ.. గ్రామస్వరాజ్య ప్రతీక అయిన స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.

'మళ్లీ పుట్టిన గాంధీ.. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి'
'మళ్లీ పుట్టిన గాంధీ.. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి'

వైకాపాకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయని.. నిమ్మగడ్డ పై కులముద్రవేసి తమకు జరిగిన అవమానం పై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. జగన్ అభిమానించే కేసీఆర్ శాసనమండలి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని.. మళ్లీ పుట్టిన గాంధీ.. గ్రామస్వరాజ్య ప్రతీక అయిన స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.

ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఇష్టం లేకపోయినా కుల ముద్రవేసిన నిమ్మగడ్డతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై చర్చ జరపాలి. రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలకు విఘాతం కలుగుతుందని మా పార్టీ నేతలు భయపడుతున్నారు. ఆయన ఎన్నికల కమిషనర్​గా ఉండగా.. ఎన్నికలు జరపొద్దని మా నేతలు డరోనాతో భయపడుతున్నారు.

- రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ

ఆరోగ్య శ్రీ కార్డు ఉన్న వారిని ఏపీలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో అనుమతించడం లేదని రఘురామ ఆవేదన చెందారు. మాన్సస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీని భ్రష్టు పట్టించే ప్రయత్నాలు ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయని... ఆరోపించారు. పూర్వ విద్యార్థులు ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. న్యాయస్థానాల్లో కేసులు వేసి పోరాడాలని సూచించారు. అశోక్ గజపతిరాజు నిజాయితీ ప్రతి ఒక్కరికీ తెలుసునని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

సేవను సరిహద్దులు దాటించిన తెలుగు తేజాలు.!

Last Updated : Oct 10, 2020, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.