ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP SC Cell Meet : మాల, మాదిగలను సమన్వయం చేసుకుంటూ సీట్ల కేటాయింపు : వర్ల రామయ్య

By

Published : Jun 14, 2023, 8:13 AM IST

TDP SC Cell Meeting in mangalagiri: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీడీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం దళితులపై వివక్ష చూపుతోందని టీడీపీ నేతలు మండిపడ్డారు.

Etv Bharat
Etv Bharat

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాదిగల ఆత్మీయ సమావేశం

SC Intimate Meeting In Mangalagiri: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డు నియోజకవర్గాల్లో మాల, మాదిగలను సమన్వయం చేసుకుంటూ సీట్ల కేటాయింపు.. పార్టీలో కీలకపదవులు కల్పిస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీల 27 సంక్షేమ పథకాల్ని రద్దు చేసిన.. జగన్‌ మాదిగల ద్రోహి అని టీడీపీ మాదిగ సామాజికవర్గ నేతలు ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో హోంమంత్రి, పురపాలకశాఖ మంత్రుల పరిస్థితి వాలంటీర్ల కంటే అధ్వాన్నంగా మారిందని టీడీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో మాదిగలపై దాడులు, ఆస్తుల విధ్వంసం, అత్యాచారాలు జరుగుతున్నా.. ప్రాణాలు కోల్పొతున్నా వైసీపీలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు నోరెత్తకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయం.. పక్క రాష్ట్రాలలతో పోల్చి చూసినప్పుడు తగ్గిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్‌ అవినీతిపరుడని, రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని తెలుగుదేశం మాత్రమే కాకుండా బీజేపీ అగ్రనేతలైన అమిత్‌షా, జేపీ నడ్డాలే అంటున్నారని గుర్తు చేశారు. బీజేపీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందించాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.

తిన్న తినకపోయిన కడుపుమాడిన క్రమశిక్షణతో ఉండేది మీరని.. మీకు గుర్తు చేస్తున్న అని మాదిగ నేతలను ఉద్దేశ్యించి టీడీపీ పొలిట్​బ్యూరో సభ్యలు వర్ల రామయ్య అన్నారు. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే ప్రధానమైన పదవీలో మిమ్మల్ని పెట్టాలని మీరు చంద్రబాబును అడిగారని.. దానికి చంద్రబాబు అంగీకరించరాని తెలిపారు. అంతేకాకుండా మాదిగ, మాల, రెల్లి కార్పోరేషన్లను కొనసాగించటానికి చంద్రబాబు సుముఖుత చూపారని వివరించారు.

సామాజిక మాధ్యమాల్లో వైసీపీ పేటీఎం బ్యాచ్‌ దుష్ప్రచారానికి తెగబడిందని టీడీపీ ఎస్సీ విభాగ అధ్యక్షుడు ఎంఎస్​ రాజు దుయ్యబట్టారు. నెల్లూరులో తనను అరెస్టు చేసి 24 గంటల పాటు పలు పోలీస్​ స్టేషన్లు తిప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్​ స్టేషన్ల చుట్టూ తిప్పే సమయంలో.. వాహనాలు మారుస్తూ భయపెట్టాలని చూశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురిచేసినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్‌ హయాం నుంచి చంద్రబాబు వరకు పార్టీలో మాదిగలకు సముచిత స్థానం లభించిందని, చర్మకారుల, డప్పు కళాకారులకు పింఛన్‌ ఇచ్చిన ఘనత టీడీపీదేనని స్పష్టం చేశారు.

"తిన్న తినకపోయిన కడుపుమాడిన క్రమశిక్షణతో ఉండేది మీరు అది మీకు గుర్తు చేస్తున్న. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే ప్రధానమైన పదవీలో మమ్మల్ని పెట్టాలని మీరు చంద్రబాబును అడిగారు.. దానికి చంద్రబాబు అంగీకరించరు. అదే కాకుండా మాదిగ, మాల, రెల్లి కార్పోరేషన్లను కొనసాగించటానికి చంద్రబాబు సుముఖుత చూపారు." -వర్ల రామయ్య , టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు

"ఎస్సీలు తెలుగుదేశానికి కృతజ్ఞత ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్​మోహన్​ రెడ్డి ప్రభుత్వ హయంలో మాదిగలకు ఆత్మగౌరవం లేదు. అక్కడ హోం మంత్రైనా వాలంటీర్​ కన్నా అధ్వాన్నమే. పక్క నియోజకవర్గంలో పర్యటించే స్వేచ్ఛ లేదు." -ఎంఎస్‌ రాజు, టీడీపీ ఎస్సీ విభాగ అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details