ETV Bharat / state

'ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి స్పందించాలి'

author img

By

Published : Jan 20, 2021, 5:30 PM IST

ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి స్పందించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఏప్రిల్ 28న విజయవాడలో మాదిగల విస్తృత స్థాయి సమావేశంలో మాదిగల సత్తా చూపాలని అన్నారు.

ap mrps leaders on cm jagan
ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర

ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి స్పందించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలు విషయాన్ని సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలకు అప్పగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇకనైనా ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

గత 26 ఏళ్ల నుంచి మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న ఉద్యమంలో చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఆయన తెలంగాణలో ఉద్యమం చేయకుండా ఆంధ్రప్రదేశ్​కు రావడం ఏమిటని వెంకటేశ్వర మాదిగ ప్రశ్నించారు. కడప ప్రెస్ క్లబ్​లో రాయలసీమ ఎమ్మార్పీఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఒక్కో జిల్లాలో మందకృష్ణ మాదిగ వసూలు చేసిన రూ. 5 లక్షలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏప్రిల్ 28న విజయవాడలో మాదిగల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి మాదిగల సత్తా చూపిస్తామని అన్నారు.

ఇదీ చదవండి: 'భీమా కోరేగావ్ మహావీరుల పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.