ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Escape: నరసరావుపేట నుంచి రాజస్థాన్ కుటుంబం పరారీ..ఏమైంది..!

By

Published : Sep 14, 2021, 7:52 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి రాజస్థాన్ కుటుంబం పరారైంది. తమ వద్ద రూ.కోటికి పైగా అప్పు చేసి పరారయ్యారని బాధితులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

నరసరావుపేట నుంచి రాజస్థాన్ కుటుంబం పరారీ
నరసరావుపేట నుంచి రాజస్థాన్ కుటుంబం పరారీ

గుంటూరు జిల్లా నరసరావుపేటలో వినాయక విగ్రహాలు తయారుచేసే రాజస్థాన్ కుటుంబం పరారైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలో ఓ రాజస్థాన్ కుటుంబం గత 20 ఏళ్లుగా వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తోంది. నమ్మకంగా ఉంటూ పట్టణంలో పలువురి వద్ద రూ. కోటికి పైగా అప్పులు చేశారు. అప్పు తీర్చాలని రుణదాతలు ఒత్తిడి తేవటంతో ఇల్లు వదిలేసి పరారయ్యారు.

కోపోద్రిక్తులపైన బాధితులు విగ్రహాల తయారీ దుకాణంపై దాడికి దిగారు. దుకాణాన్ని మెుత్తం ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు సీఐ అచ్చయ్య వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details