ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ... పలువురికి గాయాలు

By

Published : May 30, 2021, 10:58 PM IST

గుంటూరు జిల్లా మారేళ్లవారిపాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.

quarreling between two groups at marellavaripalem
ఇరువర్గాల ఘర్షణ... పలువురికి గాయాలు

గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం మారేళ్లవారిపాలెంలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ నేతలు బాణాసంచా కాల్చారు. బాణాసంచాను తెదేపా కార్యకర్తల ఇళ్లపై వేస్తుండగా వారు ఖండించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొని రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details