ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Fencing: సీఎం నివాసానికి వెళ్లే అన్ని మార్గాల్లో ముళ్లకంచెల తొలగింపు

By

Published : Oct 28, 2022, 2:09 PM IST

Updated : Oct 28, 2022, 3:05 PM IST

Police removed Fencing: రెండు నెలల క్రితం... సీఎం నివాసానికి వెళ్లే అన్ని మార్గాలలో వేసిన ముళ్లకంచెలను పోలీసులు తొలగించారు. చలో సీఎం నివాసం పేరుతో గతంలో ఉద్యోగులు ఆందోళనకు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు... సీఎం నివాసానికి వెళ్లే అన్ని మార్గాల్లో ఏర్పాటు చేసిన ముళ్లకంచెలను ఇవాళ తొలగించారు.

Police removed Fencing
ముళ్లకంచెల తొలగింపు

Police removed Fencing: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి వెళ్లే జాతీయ రహదారిపై వేసిన ముళ్ల కంచెను పోలీసులు తొలగించారు. దాదాపు రెండు నెలల క్రితం ఉద్యోగులు చలో సీఎం నివాసం పేరుతో ఆందోళనకు పిలుపునిచ్చారు. అప్రమత్తమైన పోలీసులు ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే అన్ని మార్గాలలో ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర ముళ్లకంచెలు వేశారు. అప్పటినుంచి వాటిని తొలగించకుండా అలానే వదిలేశారు. జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్లకి వెళ్లే పాదచారులు ముళ్ల కంచె వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీటిని తొలగించాలని పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించారు. దీంతో పోలీసులు ముళ్ల కంచెను తొలగించారు.

Last Updated : Oct 28, 2022, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details