ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరులో కొనసాగుతున్న పోలింగ్​... ఓటింగ్​ సరళిపై కలెక్టర్​ ఆరా

By

Published : Apr 8, 2021, 12:15 PM IST

గుంటూరు జిల్లాలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. తెదేపా ఎన్నికలను బహిష్కరించటంతో పోటీ లేక ఎన్నికల సందడి కరవైంది. జిల్లాలో 45 జెడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్​ జరుగుతోంది. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.

parishad elections in guntur
గుంటూరులో కొనసాగుతున్న పోలింగ్​

గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, రొంపిచర్ల మండలాల్లో పరిషత్​ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 7గంటల నుంచే ఓటర్లు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్​ కేంద్రాల వద్ద పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

చిలకలూరిపేటలో..

నియోజకవర్గంలో ఎన్నికలు మందకొడిగా సాగుతున్నాయి. ఉదయం 9గంటల వరకు చిలకలూరిపేట మండలంలో 5 శాతం, యడ్లపాడులో 6%, నాదెండ్లలో 10 శాతం పోలింగ్ నమోదైంది. చాలా చోట్ల పోలింగ్​ కేంద్రాలు ఖాళీగా కనిపిస్తున్నాయి.

రేపల్లెలో..

ఎండ తీవ్రత కారణంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. వృద్దులు, బాలింతలు ఓటు వేసేందుకు తరలి వస్తున్నారు. నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా.. అందులో నిజాంపట్నం మండలంలోని 17 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వైకాపా 12, తెదేపా 3, స్వతంత్ర స్థానాలు రెండు ఏకగ్రీవమయ్యాయి.

చెరుకుపల్లి మండలంలో మొత్తం 17 స్థానాలకు.. చెరుకుపల్లిలో వైకాపా -1 ఏకగ్రీవం అయ్యింది. నగరం మండలంలో 14 స్థానాలకు గానూ.. పెద్దవరం ఎంపీటీసీ స్థానం వైకాపాకు ఏకగ్రీవంగా దక్కింది. రేపల్లెలోని 17 స్థానాలలో లంకెవాని దిబ్బ, మోల్లగుంట వైకాపాకు ఏకగ్రీవం అవ్వగా... నల్లూరిపాలెంలో పోటీలో ఉన్న అభ్యర్థి చనిపోవడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. మొత్తం 14 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది.

ప్రత్తిపాడులో..

నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. కాకుమాను, ప్రత్తిపాడు, పెదనందిపాడు మండలాల్లో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఓటింగ్ సరళిపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తాగునీటి సౌకర్యం, వైద్య శిబిరం ఏర్పాటు గురించి ఆరా తీశారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాలని ఆదేశించారు.

ఇదీ చదవండి:తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details