ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కిడ్నీ అమ్మాలనుకుంది.. రూ.16 లక్షలు పోగొట్టుకుంది

By

Published : Dec 12, 2022, 4:32 PM IST

Updated : Dec 12, 2022, 6:50 PM IST

Online Kidney Fraud: ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు డబ్బు దోచుకోవడానికి ఎన్నో మార్గాలు ఎంచుకుంటున్నారు. కొత్త కొత్త మోసాలతో అమాయకులనే ఆసరాగా చేసుకుని మనీని మాయం చేస్తున్నారు. అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో జరిగింది. తండ్రి ఖాతాలోని డబ్బు అవసరాలకు వాడుకున్న ఓ అమ్మాయి.. కిడ్నీ అమ్మి ఆ డబ్బు ఇవ్వాలనుకుని చివరకు సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కింది. అసలేం జరిగిందంటే..!

Online kidney fraud:
ఆన్‌లైన్ కిడ్నీ మోసం

Online Kidney Fraud:తండ్రి ఖాతాలోని డబ్బు అవసరాలకు వాడుకున్న ఓ అమ్మాయి.. కిడ్నీ అమ్మి ఆ డబ్బు ఇవ్వాలనుకుని చివరకు సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన ఇంటర్ విద్యార్థినికి యామిని హైదరాబాద్‌లో నర్సింగ్‌ చేస్తోంది. అవసరాల కోసం ఆమెకు తన తండ్రి ఏటీఎం కార్డు ఇచ్చారు. దాంతో అందులో నుంచి 2 లక్షల రూపాయల వరకూ వాడుకుంది. ఆ డబ్బును రికవరీ చేయడం కోసం కిడ్నీ అమ్మాలని ఆన్‌లైన్‌లో కనిపించిన నంబర్‌ను సంప్రదించింది. అనంతరం ఆమె అవసరాన్ని గుర్తించిన సైబర్‌ నేరగాళ్లు.. రూ.3 కోట్లు ఇస్తామంటూ ఎరవేశారు. పన్నుల కింద దఫదఫాలుగా రూ.16 లక్షలు గుంజారు. కొంత కాలానికి మోసపోయానని గుర్తించిన యామిని తన తండ్రితో కలిసి.. గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయగా అనవసరమైన లింకులపై క్లిక్ చేసి మోసపోవద్దని తెలిపారు.

ఆన్ లైన్​లో కిడ్నీ అమ్మాలనుకొని మోసపోయిన యువతి

"ఆన్​లైన్​లో ఓ వెబ్​సైట్​ చూశాను.. కిడ్నీ అమ్మితే నగదు వస్తుందని ఇతరుల ద్వారా విన్నాను.. వెబ్​సైట్​ వారికి మెసేజ్​ చేయగా.. నిజమేనని నాకు చెప్పారు. ముందుగా సగం నగదు.. కిడ్నీ ఇచ్చిన తర్వాత 50 శాతం నగదు ఇస్తామని తెలిపారు. నిజమే అని నమ్మాను. అన్​లైన్​లో ఒక ఖాతా తెరిచి అందులో రూ.3కోట్ల నగదు ఉన్నట్లు చూపించారు. ఆ నగదు నా ఖాతాలో జమ చేయటానికి ఖర్చులకు డబ్బులు కావాలని అడిగారు. వారికి విడతల వారిగా రూ.16 లక్షలు చెల్లించాను."-యామిని, ఇంటర్ విద్యార్థిని

"ఆన్​లైన్​లో క్లాసులు వినాలంటే నా ఫోన్​ ఇచ్చాను. అందులో నా ఖాతా ఉంది. ఒకసారి డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్లాను. అప్పుడు ఖాతాలో నగదు లేదు. ఏమయ్యిందని మా పాపని అడగగా.. జరిగిన విషయం చెప్పింది."-రాజమోహన్​రావు, యామిని తండ్రి

"అనవసరమైన లింకులపై క్లిక్ చేయొద్దు.. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోడానికి పోలీసు శాఖ రూపొందించిన 'సైబర్ కవచ్' యాప్​ని వినియోగించుకోవాలి." -ఆరిఫ్​ హఫీజ్​, గుంటూరు ఎస్పీ

ఇవీ చదవండి:

Last Updated : Dec 12, 2022, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details