ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరులో విద్యార్థినిపై లైంగికదాడిలో కొత్తకోణం..

By

Published : Jun 28, 2020, 5:52 PM IST

Updated : Jun 29, 2020, 10:56 AM IST

గుంటూరులో విద్యార్థినికి లైంగిక వేధింపుల కేసులో ఇద్దరు యువతుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధిత యువతి నగ్న వీడియోలు వీరి ద్వారానే ఓ నిందితుడికి అందినట్లు దర్యాప్తులో తేలింది. వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

new perspective in the case of  sexual assault of student in Guntur
new perspective in the case of sexual assault of student in Guntur

గుంటూరులో విద్యార్థినిపై లైంగికదాడి కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. ఈ కేసులో వరుణ్, కౌశిక్‌ అనే యువకులతో పాటు ఇద్దరు యువతుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వరుణ్ స్నేహితురాలి ద్వారా కౌశిక్ సోదరికి.. బాధిత యువతి నగ్న దృశ్యాలు అందాయని పోలీసుల దర్యాప్తు తేలింది. తన సోదరి నుంచి వీడియోలను తీసుకున్న కౌశిక్... అనంతరం పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ కారణంగా.. ఈ ఇద్దరు యువతులపైనా కేసులు పెట్టే యోచనలో పోలీసులు ఉన్నారు.

ఇదీ జరిగింది...

మూడేళ్ల కిందట గుంటూరుకు చెందిన 17 ఏళ్ల విద్యార్థినికి (ఇప్పుడు 20 సంవత్సరాలు) అదే ప్రాంతానికి చెందిన వరుణ్‌ పరిచయమయ్యాడు. స్నేహం ముసుగులో ఆమెను చదువుకుందాం రమ్మంటూ తన అపార్టుమెంట్‌కు తీసుకెళ్లి శీతలపానీయంలో మత్తుమందు కలిపిచ్చాడు. తర్వాత ఆమెను నగ్నంగా వీడియో తీశాడు. దాన్ని అడ్డుపెట్టుకొని బెదిరించే ప్రయత్నం చేయగా యువతి అతన్ని దూరం పెట్టింది.

ఇంతలో ఆమె ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరగా అక్కడ మరో యువకుడు కౌశిక్‌ పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే ఆమె నగ్న వీడియోలు చూసిన కౌశిక్.. ఆమెతో సంబంధాన్ని వదులుకున్నాడు. అనంతరం ఆ యువతి మూడో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని అనుమానించిన కౌశిక్‌ తన వద్ద ఉన్న నగ్న వీడియోలను ఇంటర్నెట్‌లో పెట్టి ఆమెను డబ్బులివ్వాలని బెదిరించాడు. విషయం తెలిసిన యువతి బంధువులు వరుణ్‌, కౌశిక్‌ కుటుంబ సభ్యులను కలిసి వాటిని ఇంటర్నెట్‌ నుంచి తీసివేయించారు.

సమస్య తొలగిపోయిందని అనుకుంటుండగానే కొద్ది రోజుల కిందట ఆమె ఇన్​స్టాగ్రామ్ ఖాతాకు చీటింగ్ 420 అనే ఐడీతో గుర్తు తెలియని వ్యక్తి వీడియోలు పంపారు. సామాజిక మాధ్యమంలో వీడియో ప్రత్యక్షమవటంతో యువతి హతాశురాలైంది. దాదాపుగా మూడేళ్లుగా వేధింపులకు గురైన బాధిత యువతి అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో వరుణ్‌, కౌశిక్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

బాలికలను కిడ్నాప్ చేసిన వాలంటీర్లపై కేసు నమోదు

Last Updated :Jun 29, 2020, 10:56 AM IST

ABOUT THE AUTHOR

...view details