ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఆ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలి'

By

Published : Mar 23, 2021, 6:00 PM IST

ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగానే అధికారులు పేదల ఇళ్లు కూల్చేశారని తెదేపా నేత తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ఆత్మకూరులో ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆయన పరామర్శించారు.

Atmakuru
ఆత్మకూరులో పేదల ఇళ్లు కూల్చివేత

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో పేదల ఇళ్లను కూల్చివేసిన ఘటనలో అధికారులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఇళ్లు తొలగించేందుకు ఒకరోజు సమయం ఉన్నా.. అధికారులపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒత్తిడి తెచ్చి కూల్చేయించారని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ చెప్పారు.

ఇళ్లు కోల్పోయిన బాధితులతో తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 40 ఏళ్లకు పైగా ఉంటున్న పేదలకు ప్రత్యామ్నయ స్థలాలు చూపించిన తర్వాతే వీరిని ఖాళీ చేయించాలన్నారు. అభివృద్ధి పేరుతో పేదలను రోడ్డుపాలు చేశారని ఆక్షేపించారు.

ఇదీ చదవండి:

తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థి ఖరారు కాలేదు: పురందేశ్వరి

ABOUT THE AUTHOR

...view details