ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చరిత్రలో లేని అప్పులు తెదేపా చేసింది: బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి

By

Published : Nov 2, 2022, 10:19 PM IST

Minister Buggana Rajendranath Reddy: వైకాపా ప్రభుత్వంలో అర్థిక విధానాలపై మాజీ ఆర్ధిక మంత్రి యనమల చేసిన ఆరోపణలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి స్పందించారు. తెదేపా ప్రభుత్వంలో సమయంలో 40 వేల కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో 11 శాతం వృద్ధి రేటు చూపితే వాస్తవంలో 5.66 గా నమోదు అయ్యిందన్నారు. తెదేపా హయాంలో రాష్ట్రం అప్పులు 19.55 శాతం మేర పెరిగాయని వెల్లడించారు. తమ ప్రభుత్వంలో పెరిగింది కేవలం 15 శాతం మాత్రమేనన్నారు. 5 ఏళ్ళ కాలంలో తెదేపా  కేవలం 2,13,626 ఎకరాలకు మాత్రమే నీరు అందిస్తే.. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వంలో 10 లక్షల ఎకరాలకు నీరు అందిస్తుందని తెలిపారు.

బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
Buggana Rajendranath Reddy

Finance Minister Buggana Rajendranath: మాజీ ఆర్ధిక మంత్రి యనమలకు క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలియటం లేదని.. ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్​ నాథ్ రెడ్డి విమర్శించారు. అందుకే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చరిత్రలో లేని అప్పులు గతంలో తెదేపా ప్రభుత్వం చేసిందన్నారు. 40 వేల కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టారని మండిపడ్డారు. గత తెదేపా ప్రభుత్వం కనీసం కోడిగుడ్ల బిల్లులు సైతం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయి పెట్టీ వెళ్లిన సున్నావడ్డీ పంట రుణాలు 774 కోట్లు వైకాపా ప్రభుత్వంమే చెల్లించిందని స్పష్టం చేసారు. తమ ప్రభుత్వ హయాంలో ఎప్పటికపుడు 497 కోట్లు కూడా చెలించామన్నారు. 1785 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కూడా మా ప్రభుత్వమే ఇచ్చిందని తెలిపారు. వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ అంచనా వేసేందుకు స్మార్ట్ మీటర్ల పెట్టామని వెల్లడించారు. 20 శాతం వరకూ విద్యుత్ నష్టాల కింద విద్యుత్ పంపిణీ సంస్థలు రాస్తున్నాయి. ఉచిత విద్యుత్ సైతం ఇదే ఖాతాలో వేసేస్తున్నారు అందుకే స్మార్ట్ మీటర్లు అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి లెక్కలు కూడా తెదేపా తప్పుడు కోణంలో చూస్తోందని ధ్వజమెత్తారు.

వైద్యారోగ్యంలోనూ ఇదే తరహా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 3255 ఆరోగ్య శ్రీ చికిత్సలు మా ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. గతంలో 1055 చికిత్సలు మాత్రమే అందించారని వెల్లడించారు. ఆరోగ్య శ్రీలో అందించని చికిత్సల్లో మాత్రమే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందుతుందని వెల్లడించారు. ఎక్కడైనా శవాలను 108/104 అంబులెన్స్​లల్లో తరలిస్తారా అని ప్రశ్నించారు. ప్రతి ఆస్పత్రిలో మహాప్రస్థానం వాహనాలు ఉన్నాయన్నారు. వైద్యారోగ్యం కోసం పీ.హెచ్.సి లను 12,268 కోట్ల తో మల్టీ, సూపర్ స్పెషాలిటీ, బోధనాసుత్రులు నిర్మాణం చేపట్టామన్నారు. 1477 కోట్ల ను 2022-23 ఆర్థిక సంత్సరానికి ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు చేశామని తెలిపారు. నాడు - నేడు కోసం పాఠశాలలకు వేల కోట్లతో బాగు చేస్తున్నామన్నారు. అమ్మఒడి కోసం 13,600 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. 53 వేలకోట్ల ను పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చుచేసిందన్నారు.

రాష్ట్రంలో ఒక్క పాటశాల ను ప్రభుత్వం తొలగించలేదన్న మంత్రి కొత్తగా పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. తల్లుల సంఖ్య ఆధారంగా అమ్మఒడి ఇచ్చామన్నారు. తెదేపా హయాంలో లో 11 శాతం వృద్ధి రేటు చూపితే వాస్తవంలో 5.66 గా నమోదు అయ్యిందన్నారు. రాష్ట్ర అప్పులు తెదేపా హయాంలో 19.55 శాతం మేర పెరిగాయని వెల్లడించారు. తమ ప్రభుత్వంలో పెరిగింది కేవలము 15 శాతం మాత్రమేనన్నారు. 5 ఏళ్ళ కాలం లో తెదేపా కేవలం 2,13,626 ఎకరాలకు మాత్రమే నీరు అందిస్తే.. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వంలో 10 లక్షల ఎకరాలకు నీరు అందుతోందని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్​కు తెదేపా హయాంలో చేసిన తప్పులకు ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితి నెలకొందన్నారు. జూన్ 2019 నుంచి మొదలైన పెన్షన్ పెంపు త్వరలోనే 2750కి పెరుగుతుందని వెల్లడించారు.
ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details