ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉద్యోగుల కంటే.. రాష్ట్ర ప్రజల సమస్యలే మాకు ముఖ్యం: మంత్రి బొత్స

By

Published : Nov 17, 2022, 5:30 PM IST

MINISTER BOTSA ON EMPLOYEES ISSUE
MINISTER BOTSA ON EMPLOYEES ISSUE ()

MINISTER BOTSA ON EMPLOYEES ISSUE : ప్రభుత్వానికి ఉద్యోగుల కంటే.. రాష్ట్ర ప్రజల సమస్యలే ముఖ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సమస్యలెప్పుడూ ఉంటాయని.. ఉద్యోగులకు తీరే కోరికలుంటే మంచిదని వ్యాఖ్యానించారు. మరోవైపు ఉద్యోగులను రాజకీయాలకు వాడుకోవాలనే ఉద్దేశం గత ప్రభుత్వాలదే కానీ.. వైకాపా ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

BOTSA SATYANARAYANA ON EMPLOYEES ISSUE : ప్రభుత్వానికి ఉద్యోగుల కంటే.. రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల సమస్యలే ముఖ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలు ఎప్పుడూ ఉంటాయని,.. వారికి తీరే కోరికలు ఉంటే మంచిదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి సచివాలయంలో ఉద్యోగులతో సమావేశమయ్యారు.

పీఆర్సీ వల్ల ఉద్యోగులకు నష్టం జరిగిందంటూ.. ప్రచారం చేయటం సరికాదన్నారు. ఉద్యోగులతో చర్చించాకే పీఆర్సీపై ఉత్తర్వులు వచ్చాయని వెల్లడించారు. 12వ పీఆర్సీ వేయమని కోరడం తప్పు కాదన్న మంత్రి.. ఉద్యోగులకు జీతాల రూపంలో ప్రభుత్వం రూ.80వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని వివరించారు. ఉద్యోగులు కొన్ని అంశాలపై కోర్టులకు వెళ్లటం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందేమీ లేదని,.. కోర్టు నిర్ణయం ప్రకారం ముందుకెళితే ఉద్యోగులకే సమస్య అని మంత్రి బొత్స వివరించారు.

ఉద్యోగుల కంటే.. రాష్ట్ర ప్రజల సమస్యలే మాకు ముఖ్యం

అభివృద్ధే మా అజెండా: ఉద్యోగులను రాజకీయాలకు వాడుకోవాలనే ఉద్దేశం వైకాపా ప్రభుత్వానికి లేదని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగులను రాజకీయాలకు ఉపయోగించుకోవాలనేది గత ప్రభుత్వాల ధోరణి అని విమర్శించారు. ఉద్యోగుల గ్రూపులతో లబ్ధి పొందాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు వారి రాష్ట్రానికే పరిమితమన్నారు. ఎవరి ఉచ్చులోనూ తాము పడబోమని స్పష్టం చేశారు. అభివృద్ధి మాత్రమే తమ అజెండా అని.. ఏ రాష్ట్ర రాజకీయాలతో తమ రాష్ట్రానికి సంబంధం లేదన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details