ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Weather Update: ఉపరితల ద్రోణి.. రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడే సూచన

By

Published : Apr 15, 2023, 4:50 PM IST

Updated : Apr 15, 2023, 5:49 PM IST

Rainfall Indications: ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి కేరళ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. వివరాల్లోకి వెళ్తే..

Moderate rains are expected in the state
రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడే సూచనలు

Rainfall Indications: ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి కేరళ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్​లోని ఈశాన్య ప్రాంతాల నుంచి తమిళనాడు వరకూ ఏపీ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది. సగటున సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నట్లు స్పష్టం చేసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడడక్కడా మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.

మండుతున్న ఎండలు: ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో వడగాలులు వీచే సూచనలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది.

మరోవైపు రాష్ట్రంలో వేర్వేరు చోట్ల 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ధవళేశ్వరంలో 43.25 డిగ్రీల సెల్సియస్, నంద్యాల జిల్లా రుద్రవరంలో 43.18, రాజమహేంద్రవరం 42.6, పొన్నూరు 42.5, పార్వతీపురం మన్యం 42.3, శ్రీకాకుళం జిల్లా పలాస 42.36, విజయనగరం 42.35, ఏలూరు 42.27, బాపట్ల 42.24, విజయనగరం 42.19, కడప 42.09, అనకాపల్లి 42.01, నంద్యాల 42.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

ప్రకాశం 41.98,కాకినాడ 41.9, నెల్లూరు 41.8, విశాఖపట్నం 41.76, తణుకు 41.3, కృష్ణా జిల్లా 41.6, నరసరావుపేట 40.6, కోనసీమ 40.7, చిత్తూరు 40.6, తిరుపతి 40.8, అనంతపురం 40, శ్రీకాకుళం 39.9, ఎన్టీఆర్ 39.8, సత్యసాయి జిల్లా 39.81 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో పడిన వర్షాలు:
కాగా ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా అదోనిలో భారీ వర్షం కురిసింది. ఎండల వేడి, ఉక్కపోతతో గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది. దీంతోపాటు హైదరాబాద్​లో కూడా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల భాగ్యనగంలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో మెట్రో స్టేషన్ల వద్ద వాహనదారులు ఆగిపోవటంతో ట్రాఫిక్​కు కూడా కాస్త అంతరాయం ఏర్పడింది.

ఇవీ చదవండి:

Last Updated : Apr 15, 2023, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details