ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భూహక్కు చట్టంతో ప్రజలకు తీవ్ర నష్టం - వెంటనే రద్దు చేయాలంటూ న్యాయవాదుల నిరసనలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 9:03 PM IST

Lawyers Protest Against AP Land Titling Act 2022: భూ సమస్యలు పరిష్కరించే బాధ్యతలు రెవెన్యూ అధికారులకు అప్పగిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఇది న్యాయవ్యవస్థలోకి కార్యనిర్వాహక వ్యవస్థ పూర్తిగా చొచ్చుకురావడమేనని నినదించారు. కొత్త చట్టంతో ప్రజలు తమ ఆస్తిపై సర్వహక్కులూ కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. తక్షణం ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Lawyers_Protest_Against_Ap_Land_Titling_Act_2022
Lawyers_Protest_Against_Ap_Land_Titling_Act_2022

Lawyers Protest Against AP Land Titling Act 2022: ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ రాష్ట్రంలో పలుచోట్ల న్యాయవాదులు ఆందోళనకు దిగారు. భూ హక్కుల చట్టం 2022ని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని న్యాయవాదులంతా వ్యతిరేకించాలని హైకోర్టు వద్ద ఆందోళనకు దిగారు. ప్రజల హక్కులను, ఆస్తులను హరించే విధంగా చట్టం ఉందని న్యాయవాదులు అన్నారు.

Protest Against State Land Rights Act in Vijayawada: బెజవాడ బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించిన న్యాయవాదులు, మానవహారంగా ఏర్పడి తమ నిరసన తెలిపారు. ప్రజల హక్కులను హరించే విధంగా ఉన్న ఈ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. హైకోర్టు ఆవరణలోనూ న్యాయవాదులు నిరసన తెలిపారు. ప్రభుత్వం నిరంకుశంగా ఈ చట్టాలను తీసుకొచ్చిందని, ప్రజలందరూ ఈ చట్టం గురించి తెలుసుకుని వ్యతిరేకించాలని కోరారు.

భూ యాజమాన్య హక్కు చట్టాలతో అధికార పార్టీ నేతలకే న్యాయం - ఆందోళన తీవ్రతరం చేస్తామని లాయర్ల హెచ్చరిక

Lawyers Protest in Guntur: భూమిహక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలంటూ గుంటూరు బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గుంటూరు జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు నినాదాలు చేశారు. భూమి యాజమాన్య హక్కు నిర్దేశించే హక్కుని న్యాయస్థానాన్ని కాదని కొత్త వ్యవస్థ చేతుల్లో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని న్యాయవాదులు ఆరోపించారు. చట్టం రూపొందించే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థకు సంబంధం లేనివారితో చట్టానికి రూపకల్పన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్త భూహక్కు చట్టం మొత్తం లోపభూయిష్టంగా ఉందన్నారు. ప్రభుత్వం చెబుతున్న అప్పిలేట్ అథారిటి ఎవరనేది చట్టంలో స్పష్టంగా నిర్వచించకపోవటం అనుమానాలకు తావిస్తోందన్నారు. జిల్లా కోర్టుల ప్రమేయం లేకుండా హైకోర్టులు కేసుల్ని తీసుకోవని, మరి కొత్త చట్టంలో అలాంటి వాటికి అవకాశం కల్పించటాన్ని న్యాయవాదులు తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

భూ హక్కుల చట్టం రద్దు చేయాలంటూ రోడ్డెక్కిన న్యాయవాదులు - ప్రభుత్వంపై ఆగ్రహం

Lawyers Agitation in East Godavari: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అనపర్తి దేవి చౌక్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. దీంతో అనపర్తి మెయిన్ రోడ్డుతో పాటు కెనాల్ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోందంటూ పోలీసులు లాయర్లకు సూచించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొత్త చట్టం వల్ల ప్రజలకు జరిగే నష్టాలపై అవగాహన కల్పిస్తామన్న న్యాయవాదులు, ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

'భూమి హక్కు చట్టం రద్దు చేయాలి' అధికారం కొత్త వ్యవస్థ చేతుల్లోకి వెళ్తుంది : న్యాయవాదుల ఆందోళన

Lawyers Protest Against AP Land Titling Act 2022: భూహక్కు చట్టంతో ప్రజలకు తీవ్ర నష్టం - వెంటనే రద్దు చేయాలంటూ న్యాయవాదుల నిరసనలు

ABOUT THE AUTHOR

...view details