ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరు జిల్లాలో భారీగా అక్రమ మద్యం పట్టివేత

By

Published : Sep 11, 2021, 5:49 PM IST

గుంటూరు జిల్లాలో భారీ ఎత్తున అక్రమ మద్యాన్ని ఎస్​ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితుల్ని పట్టుకున్నారు.

అక్రమ మద్యం పట్టివేత
అక్రమ మద్యం పట్టివేత

తెలంగాణలోని నల్లగొండ జిల్లా నుంచి గుంటూరు జిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యంపై ఎస్​ఈబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. అక్రమ మద్యం సరఫరా చేస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసున్నారు. వారి వద్ద నుంచి 2304 లిక్కర్ బాటిళ్లు, కారు, ట్రక్​, బైక్​ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు.

గుంటూరు జిల్లా తుమ్మలచెరువు, కరాలపాడు, పెదగార్లపాడు, చినగార్లపాడు నాలుగు రోడ్ల కూడలి వద్ద ఎస్​ఈబీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు.

అయితే నిందితుల్లో దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామానికి చెందిన లంకమల్ల నాగేంద్రబాబు అనే వ్యక్తి తెలంగాణ నల్గొండ జిల్లాకు చెందిన ఎ. కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కిరణ్ కుమార్.. నాగేంద్ర బాబు సాయంతో గుంటూరు జిల్లా పొందుగుల చెక్ పోస్ట్ దాటించే ప్రయత్నం చేయగా పట్టుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:కారులో అరలు.. తీసేకొద్ది బయటపడ్డ తెలంగాణ మద్యం సీసాలు

ABOUT THE AUTHOR

...view details