ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొత్త జిల్లాల ఏర్పాటుపై.. జనవరి 26న ప్రకటన: కోన రఘుపతి

By

Published : Oct 27, 2020, 2:09 PM IST

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వచ్చే ఏడాది జనవరి 26న స్పష్టమైన ప్రకటన ఉంటుందని శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి తెలిపారు. మెుత్తం 26 జిల్లాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు.

కొత్త జిల్లాలపై.. జనవరి 26న ప్రకటన: కోన రఘుపతి
కొత్త జిల్లాలపై.. జనవరి 26న ప్రకటన: కోన రఘుపతి

పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినా... అరకు నియోజకవర్గం విషయంలో ఏర్పడిన సంక్లిష్టతలతో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటవుతాయని కోన రఘుపతి వివరించారు. గుంటూరులోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో మాట్లాడారు. వాన్ పిక్ భూముల్లో కొందరు సాగు పనులు ప్రారంభించటాన్ని ఆయన తప్పుబట్టారు. అప్పట్లోనే రైతులకు పరిహారం ఇచ్చారని.. భూములు వాన్ పిక్ సంస్థకు స్వాధీనం చేశారని తెలిపారు. ఈ విషయంలో కొందరు గందరగోళం రేపేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. నిజాంపట్నం పోర్టుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు కోన చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details