ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రహదారిపై గుంతలకు వైకాపా రంగులు.. తాడేపల్లిలో జనసేన వినూత్న నిరసన

By

Published : Jul 18, 2022, 8:37 AM IST

JANASENA PROTEST: రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని తెలిపేందుకు జనసేన నిర్వహిస్తున్న ‘గుడ్‌మార్నింగ్‌ సీఎం సర్‌’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోని తాడేపల్లి- ప్రాతూరు రహదారిపై ఆందోళనలు నిర్వహించారు. రోడ్లపై ఉన్న గుంతలకు వైకాపా రంగులు వేసి నిరసన తెలిపారు.

JANASENA PROTEST
JANASENA PROTEST

JANASENA PROTEST: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసానికి కూతవేటు దూరంలోనే రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని.. రాష్ట్రంలో ఇంకెలా ఉంటాయో ఊహించనవసరం లేదని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపు మేరకు ‘గుడ్‌మార్నింగ్‌ సీఎం సర్‌’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోని తాడేపల్లి- ప్రాతూరు రహదారిపై ఉన్న గుంతలకు వైకాపా జెండా రంగులు వేసి నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి నుంచి అర కిలోమీటరు మేర దెబ్బతిన్న ప్రాతూరు రహదారిపై గుంతలను చూపుతూ ప్రదర్శన నిర్వహించారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details