ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగన్ ప్రభుత్వం చాక్లెటిచ్చి.. నిలువునా దోపిడీ చేస్తోంది: కన్నా లక్ష్మీనారాయణ

By

Published : Dec 26, 2022, 8:56 PM IST

BJP senior leader Kanna fire on CM Jagan: ఎస్సీ కార్పొరేషన్ నిధుల మళ్లింపుల విషయంలో బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రంగా ఆగ్రహించారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులను వేరే పథకాలకు మళ్లించకూడదని గతంలో చట్టం ఉన్నప్పటికీ.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించారు. ఎస్సీ కార్పోరేషన్ కింద అమలు జరగాల్సిన 26 పథకాలను మళ్లీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

BJP leader KANNA
జగన్ ప్రభుత్వం నిలువునా దోపిడీ చేస్తుంది

BJP leader Kanna fire on CM Jagan: ఎస్సీ కార్పొరేషన్ నిధులను వేరే పథకాలకు మళ్లించకూడదని గతంలో చట్టం ఉన్నప్పటికీ.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిందని బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహించారు. ఎస్సీ కార్పొరేషన్ కింద అమలు జరగాల్సిన 26 పథకాలను రద్దు చేశారని, రద్దు చేసిన ఆ 26 పథకాలను మళ్లీ అమలు చేయాలంటూ.. గుంటూరు కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 48 గంటల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమానికి అతిథులుగా మహారాష్ట్రకు చెందిన శంభునాధ్ తుండియా, రాష్ట్ర సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. జగన్ ప్రభుత్వం వచ్చాక వింత పోకడ కనిపిస్తుందని... చాక్లెట్ ఇచ్చి నిలువునా దోపిడీ చేస్తున్నారని కన్నా ఎద్దేవా చేశారు. జగన్​ది మోసపూరిత వ్యాపార దృక్పథమని... ప్రజల సొమ్మును ప్రజలకే పంచిపెడుతూ సంక్షేమం అంటూ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. పోలీసు వ్యవస్థను ఇంతలా దిగజార్చిన ఘనత జగన్‌దేనని కన్నా విమర్శించారు.

జగన్ ప్రభుత్వం వచ్చాక వింత పోకడ కనిపిస్తుందన్న బీజేపీ నేతలు

ఎవరు కూడా ఈ ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను డైవర్ట్ చేయడానికి వీల్లేదు. కానీ ఇవాళ జగన్ మోహన్ రెడ్డి..నవరత్నాల గురించి ఎన్నికలప్పుడు చెప్పాను..ఆ నవరత్నాలకు నిధులు ఇస్తున్నాను కాబట్టి తాను అమలుచేస్తున్నానని చెప్పాడు. ఆ నవరత్నాలకు ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులిచ్చే అధికారం జగన్ మోహన్ రెడ్డికి ఎవరిచ్చారు.-కన్నా లక్ష్మీనారాయణ, మాజీమంత్రి

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details