ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఈ నెల 11 నుంచి ఇంటర్‌ పరీక్షల మూల్యాంకనం'

By

Published : May 7, 2020, 4:30 PM IST

Updated : May 7, 2020, 5:27 PM IST

minister adimulapu suresh
minister adimminister adimulapu sureshulapu suresh

16:23 May 07

మే 11 నుంచి ఇంటర్‌ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి ఇంటర్‌ విద్యకు సంబంధించిన బోర్డు అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలుత గ్రీన్, ఆరెంజ్‌ జోన్​లలో మూల్యాంకనం చేయనున్నట్లు తెలిపారు. లాక్​డౌన్ ముగిసిన అనంతరం రెడ్ జోన్‌లో జరుగుతుందన్నారు. కోవిడ్- 19 జాగ్రత్తలను పాటిస్తూనే మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి అన్నారు. రోజూ రెండు షిఫ్ట్‌ల్లో ఈ ప్రక్రియ సాగుతుందన్నారు. ఇప్పటికే పలు పోటీ పరీక్షలకు సంబంధించిన తేదీలు ఖరారు కావటంతో త్వరితగతిన ఇంటర్‌ మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను వెల్లడించాల్సి ఉందన్నారు. జూన్ చివరి నాటికి ఇంటర్‌ బోర్డు వెబ్​సైట్​లో విద్యార్థులకు థియరీ క్లాసులు, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో పాఠాలు, ప్రాక్టికల్స్​కు సంబంధించిన వీడియోలు పొందుపరుచనున్నట్లు మంత్రి తెలిపారు.

Last Updated :May 7, 2020, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details