ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆగని అక్రమ మద్యం రవాణా.. అడ్డుకుంటున్న పోలీసులు

By

Published : Jan 6, 2021, 9:58 AM IST

అక్రమంగా మద్యం తరలించేందుకు ప్రయత్నిస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నా... నిందితుల్లో మాత్రం మార్పు రావటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిందితులు మద్యం, సారాను తరలించేందుకు ప్రయత్నించి... పోలీసులకు చిక్కారు.

wine caught by police
అక్రమ మద్యం రవాణా

గుంటూరులో..

గోవా నుంచి రాష్ట్రానికి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గోపీచంద్​ నుంచి 4 లక్షల విలువైన 393 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు. గోవా నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ టూత్​పేస్ట్ లారీలో మద్యాన్ని తీసుకువచ్చి.. గుంటూరు చుట్టుగుంటలో నిల్వ ఉంచినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.

కడపలో...

కడప జిల్లా వీరపునాయునిపల్లి మండలం బుసిరెడ్డిపల్లె సమీపంలో... కొండల్లో ఉన్న నాటు సారా బట్టీలను పోలీసులు ధ్వసం చేశారు. సుమారు 100 లీటర్ల బెల్లం ఊటను ధ్వసం చేసి.. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి లీటరు నాటుసారా స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేశారు.

అనంతపురంలో...

అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం... పోలీసులు వాహన తనిఖీల్లో బయటపడింది. తమను చూసి నిందితులు వాహనాన్ని వదిలి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. వాహనంలో ఉన్న 382 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారైన నిందితుడిని ముండ్లవారిపల్లికి చెందిన మల్లికార్జునుగా గుర్తించామన్నారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా నేతల కాగడాల ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details